సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో భారతీయులెవరైనా ఉన్నరా? అనే విషయంపై ఆరా తీస్తున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది. సౌదీ జెద్దాహ్ నగరంలోని భారత దౌత్య కార్యాలయం ద్వారా వివరాలు తెలుసుకుంటున్నట్లు విదేశాంగ మంత్రి జయ్శంకర్ ట్వీట్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
రోడ్డు ప్రమాదంలో 35 మంది మృతి చెందిన వార్త తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం- 35మంది మృతి