భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికి ఆందోళనకరంగానే ఉందని దిల్లీ ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను వెంటిలేటర్‌పైనే ఉంచి.. చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
కుమార్తె భావోద్వేగం..
ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠా ముఖర్జీ.. తండ్రి కోలుకోవాలని కాంక్షిస్తూ ట్విట్టర్లో భావోద్వేగ పోస్ట్ చేశారు.
"గతేడాది ఆగస్టు 8న అత్యంత సంతోషకరమైన రోజు. ఆ రోజు నాన్న.. భారత అత్యున్నత పురస్కారం భారత రత్న అందుకున్నారు. సరిగ్గా సంవత్సరం గడిచేసరికి ఆయన ఆరోగ్యం విషమించింది.
ఆనందాన్ని, దుఃఖాన్ని... రెండింటినీ సమానత్వంతో అంగీకరించేలా దేవుడు నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. నాన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు."
- షర్మిష్ఠ ముఖర్జీ
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్