ETV Bharat / bharat

అప్పటివరకు తిహార్​ జైలులోనే 'బుకీ' చావ్లా! - క్రికెట్​ మ్యాచ్​ ఫిక్సింగ్​

మ్యాచ్​ ఫిక్సింగ్​ కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రధాన బుకీ సంజీవ్​ చావ్లాను తిహార్ జైలుకు తరలించాలని దిల్లీ హైకోర్ట ఆదేశాలిచ్చింది. 12 రోజుల పోలీసు కస్టడీని సవాలు చేస్తూ చావ్లా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు.. ఈ మేరకు తీర్పునిచ్చింది.

DL-HC-BOOKIE
సంజీవ్ చావ్లా
author img

By

Published : Feb 14, 2020, 8:19 PM IST

Updated : Mar 1, 2020, 8:52 AM IST

మ్యాచ్​ ఫిక్సింగ్ కేసులో ప్రధాన బుకీ సంజీవ్ చావ్లాను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు తిహార్ జైలుకు తరలించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. 2000 సంవత్సరంలో వెలుగులోకి వచ్చిన మ్యాచ్​ ఫిక్సింగ్​ కేసులో ప్రధాన నిందితుడైన చావ్లాను గురువారం అరెస్టు చేశారు.

తనను 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చావ్లా పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు.. తమ అభిప్రాయం తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. దర్యాప్తు అధికారి హాజరు కానందున ఈ కేసు స్థితి గురించి నివేదిక సమర్పించాలని నేర విభాగాన్ని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో చావ్లా పిటిషన్​పై తదుపరి విచారణనను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.

2000 సంవత్సరంలో అప్పటి దక్షిణాఫ్రికా సారథి హాన్సీ క్రానేతో కలిసి మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు చావ్లా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న చావ్లాను గురువారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి అజహరుద్దీన్​ కూడా ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్​ నుంచి నిషేధానికి గురుయ్యాడు.

Last Updated : Mar 1, 2020, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.