ETV Bharat / bharat

మసూద్​ అంశంపై ఆగని మాటల మంటలు - కాంగ్రెస్​

మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించడంపై భాజపా-కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ దౌత్య విజయంలో భాగస్వాములైతే రాజకీయంగా నష్టపోతామని విపక్షాల నేతలు భయపడుతున్నారని భాజపా ఆరోపించింది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్​... ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసింది.

మసూద్​ అంశంపై ఆగని మాటల మంటలు
author img

By

Published : May 2, 2019, 7:52 PM IST

జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంపై భాజపా, కాంగ్రెస్​ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ వల్లే ఈ ఘనత సాధ్యమైందని భాజపా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో విపక్షాల తీరును తప్పుపట్టింది. పదేళ్ల శ్రమకు గుర్తింపు లభించినప్పటికీ... ఈ ఘనతను విపక్షాలు చిన్నది చేసి చూస్తున్నాయని ఆరోపించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్​ జైట్లీ.

విపక్షాలపై జైట్లీ విమర్శలు

"మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం దేశానికి, దేశ దౌత్య నీతికి సంబంధించి ఎంతో పెద్ద విజయం. దేశం గెలిచినప్పుడు... భారతీయులు గెలుస్తారు. కానీ ఈ విజయంలో భాగస్వాములైతే రాజకీయంగా నష్టపోతామని విపక్షాలు అనుకుంటున్నాయి."
-- అరుణ్​ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

సంతోషమే... కానీ

మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న డిమాండ్​ను కాంగ్రెస్​ 2009లో ప్రారంభించిందని ఆ పార్టీ సీనియర్​ నేత చిదంబరం అన్నారు. పదేళ్ల అనంతరం, ఇప్పుడు ఈ ప్రక్రియ విజయవంతం అవడంపై హర్షం వ్యక్తం చేస్తూనే... ప్రధాని మోదీపై విమర్శలు చేశారు చిదంబరం. మోదీ మళ్లీ ప్రధాని బాధ్యతలు చేపట్టాలని ఇమ్రాన్​ఖాన్​ ఎందుకు ఆశిస్తున్నారని ప్రశ్నించారు.

మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత్​- పాక్​ మధ్య శాంతి చర్చలు మెరుగుపడతాయని ఇమ్రాన్​ఖాన్ గత నెలలో అన్నారు. పాకిస్థాన్​ ప్రధాని వ్యాఖ్యలపై అప్పుడే ఘాటుగా స్పందించింది కాంగ్రెస్​. ఇమ్రాన్​తో మోదీ పొత్తు కుదుర్చుకున్నారని పలుమార్లు ఆరోపించింది.

ఇదీ చూడండి: కన్నీరు మిగిల్చిన నదీ స్నానం - 8 మంది మృతి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Khartoum - 2 May 2019
1. Wide of thousands of protesters on street
2. Various of protesters on streets
3. Mid shot of people with banners
4. Various of crowds on streets
5. Wide of protests
STORYLINE:
Sudan's protest movement was holding a mass rally in Khartoum on Thursday, keeping up pressure on the military to hand over power to civilians following last month's overthrow of President Omar al-Bashir.
Thousands of people poured onto the streets, chanting slogans and waving banners.
The Forces for the Declaration of Freedom and Change, a coalition led by the Sudanese Professionals Association, had called for a "million person march" to intensify its push on the military to comply with its demands.
The protesters have been holding negotiations with the transitional military council over the creation of a new sovereign council, but the two sides remain divided over how large a role the generals should have in it.
The protesters fear the military intends to hold onto power or cut a deal with other factions that would leave much of al-Bashir's regime intact.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.