కర్ణాటక రామనగర్ జిల్లా హరోహల్లి పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శక్తి బ్యాటరీ తయారీ పరిశ్రమలో విద్యుత్తు షార్ట్‌సర్య్కూట్ వల్ల మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన క్రమంలో అందులో పని చేసే కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే.. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.
సమీపంలోని పరిశ్రమలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. అయితే.. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదీ చూడండి: గోమాత నోట్లో పేలిన నాటు బాంబు