ETV Bharat / bharat

ఆ 'సొరంగం' నుంచే జైషే ఉగ్రవాదుల చొరబాటు - అంతర్జాతీయ సరిహద్దు

జమ్ముకశ్మీర్​ సాంబా సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాలను కనుగొనేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్​ నిర్వహించాయి. నవంబర్​ 19న హతమైన నలుగురు జైషే ముష్కరులు వినియోగించిన టన్నెల్​ను గుర్తించాయి. ఇక్కడి నుంచే ఉగ్రవాదులు భారత్​లోకి చొరబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

massive-anti-tunnelling-operation-on-along-ib-in-jks-samba
ఆ 'ఉగ్ర సొరంగం' నుంచే ముష్కరులు చొరబడ్డారు..
author img

By

Published : Nov 22, 2020, 5:43 PM IST

Updated : Nov 22, 2020, 6:51 PM IST

జమ్ముకశ్మీర్​లో సైన్యం భారీ ఆపరేషన్​ చేపట్టింది. సాంబా సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ సొరంగ మార్గాన్ని గుర్తించింది. ఈ టన్నెల్​ 150 మీటర్ల పొడవున్నట్లు డీజీపీ దిల్బాగ్​ సింగ్​ సింగ్​ వెల్లడించారు. నవంబర్​ 19న నగ్రోటా ఎన్​కౌంటర్​లో హతమైన నలుగురు జైషే మహ్మద్​ ముష్కరులు.. దీని ద్వారానే దేశంలోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు.

Massive anti-tunnelling operation on along IB in JK's Samba
150 మీటర్ల పొడవైన టన్నెల్​ను గుర్తించిన సైన్యం

శుక్రవారం నుంచి సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) ఆధ్వర్యంలో ఆపరేషన్​ సాగింది. ఇతర భద్రతా దళాలు, పోలీసులు కూడా వీరికి సహకరించారు.

సాంబా సెక్టార్​లో గుర్తించిన టన్నెల్​

ఫుల్​ బాడీ ట్రక్​ స్కానర్లు కావాలి..

నగ్రోటా ఎన్​కౌంటర్ పరిణామాల అనంతరం.. ఉగ్రవాదులను గుర్తించేందుకు ఫుల్​ బాడీ ట్రక్​ స్కానర్లు కావాలని కోరుతున్నాయి భద్రతా దళాలు. ముష్కరులు ఎక్కువగా ట్రక్కుల్లో దాక్కొనే.. కశ్మీర్​ గుండా రాష్ట్రాలు దాటుతున్న నేపథ్యంలో వేర్వేరు చెక్​పోస్టుల వద్ద వీటిని అమర్చాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నారు అధికారులు.

ఇదీ చూడండి: హద్దు మీరిన పాక్- బుద్ధి చెప్పిన భారత్

బాన్ టోల్‌ప్లాజా సమీపంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో నవంబర్​ 19న భద్రతాదళాలు నిర‌్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. వారి వద్ద 11 ఏకే అసాల్ట్​ రైఫిళ్లు, 3 పిస్టోళ్లు, 29 గ్రెనేడ్లు సహా భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్​ 28న జమ్ముకశ్మీర్​లో 8 విడతల్లో జరగనున్న స్థానిక ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఉగ్రవాదులు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: 'నగ్రోటా ఉగ్రదాడి.. ఆ సంస్థ ప్రణాళిక ప్రకారమే'

Last Updated : Nov 22, 2020, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.