ETV Bharat / bharat

జేఎన్​యూలో కాళరాత్రి- కర్రలతో విద్యార్థులపై దాడి

దిల్లీలో జేఎన్​యూపై దాడి ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మాస్కులు ధరించిన ఆగంతకులు క్యాంపస్​లోకి ప్రవేశించి విద్యార్థులను తీవ్రంగా గాయపరిచారు. పరిస్థితిని అదుపు చేసేందుకు యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. హాస్టల్​ ఫీజులు, సెమిస్టర్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియపై విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణ తీవ్ర రూపం దాల్చిందని యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు న్యాయం జరగాలని డిమాండ్​ చేస్తూ... విద్యార్థులు యూనివర్సిటీ బయట బైఠాయించారు.

Masked men unleash violence on JNU campus, police stage flag march
జేఎన్​యూలో కాళరాత్రి- కర్రలతో విద్యార్థులపై దాడి
author img

By

Published : Jan 6, 2020, 5:05 AM IST

Updated : Jan 6, 2020, 10:20 AM IST

జేఎన్​యూలో కాళరాత్రి- కర్రలతో విద్యార్థులపై దాడి

దిల్లీలోని జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. చదువుల నిలయంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కొంత మంది దుండగులు మాస్కులతో యూనివర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థులపై కర్రలతో, హాకీ స్టిక్కులతో దాడికి తెగబడ్డారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న క్యాంపస్​ వాతావరణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతోందో అర్థమయ్యే సరికే.. దుండగులు విద్యార్థులను నెత్తురోడేలా కొట్టారు.

ఆదివారం సాయంత్రం మొదలైన ఈ ఘటనలో జేఎన్​యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్​ సహా 28మంది తీవ్రంగా గాయపడ్డారు.

టీచర్స్​ అసోసియేషన్​ సమావేశంలో...

జేఎన్​యూ టీచర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలోకి ఒక్కసారిగా దుండగులు ప్రవేశించి కర్రలతో విరుచుకుపడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం మూడు హొటళ్లల్లోకి చొరబడి అద్దాలు, మంచాలు నాశనం చేసినట్టు పేర్కొన్నారు.

మీ పనే.. కాదు మీ పనే...

దాడి అనంతరం వామపక్ష భావజాలం ఉన్న జేఎన్​యూఎస్​యూ.. ఆర్​ఎస్​ఎస్​ మద్దతు గల ఏబీవీపీ.. పరస్పరం ఆరోపణల వర్షం కురిపించుకున్నాయి. తమ కార్యకర్తలు, విద్యార్థులపై రాళ్లు రువ్వి దాడికి పాల్పడినట్లు ఆరోపించింది విద్యార్థి సంఘం. తమ కార్యకర్తలపై విద్యార్థి సంఘం సభ్యులు చేయి చేసుకున్నారని మండిపడింది ఏబీవీపీ.

ఘటన నేపథ్యంలో వర్సిటీ యాజమాన్యం పోలీసుల సహాయం తీసుకుంది. వెంటనే స్పందించిన దిల్లీ పోలీసులు... జేఎన్​యూలో భారీగా బలగాలను మోహరించారు. కొద్ది సేపటికి పరిస్థితి అదుపు చేసినట్టు ప్రకటించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్​షా జేఎన్​యూలో ఉద్రిక్త పరిస్థితులపై దిల్లీ పోలీస్​ కమిషనర్​ అమూల్యా పట్నాయక్​ను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీనియర్​ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు విద్యార్థుల దాడిపై నివేదిక సమర్పించాలని వర్సిటీ రిజిస్ట్రార్​ను కోరింది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ.

జేఎన్​యూ ప్రకటన...

అమానుష ఘటన చోటుచేసుకున్న కొద్ది గంటలకు జేఎన్​యూ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. సెమిస్టర్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియపై రెండు వర్గాల మధ్య వివాదం మొదలై.. తీవ్ర పరిణామాలకు దారి తీసిందని స్పష్టం చేసింది. వింటర్​ సెమిస్టర్​ కోసం తరగతి భవనాలకు వెళుతున్న విద్యార్థులను జేఎన్​యూఎస్​యూ సభ్యులు అడ్డుకున్నట్టు వివరించింది. పెంచిన హాస్టల్​ ఫీజులు తగ్గించే వరకూ లోపలికి ప్రవేశించకూడదని డిమాండ్​ చేసినట్టు తెలిపింది. ఈ పరిణామాలు ఘర్షణకు దారి తీశాయని పేర్కొంది.

విశ్వవిద్యాలయంలో హింసకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన జేఎన్​యూ... పూర్తి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్పష్టం చేసింది. విషాదకర పరిణామాల్లో విద్యార్థులకు అండగా ఉండనున్నట్టు తెలిపింది.

అధ్యాపకుల అనుమానం...

అయితే వర్సిటీలో జరిగిన అమానుష ఘటనపై పలువురు ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో గుర్తుతెలియని వ్యక్తులు.. రాడ్లతో విశ్వవిద్యాలయంలోకి ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. No access MENA. Access in Europe restricted to the following territories: Albania, Afghanistan, Armenia, Azerbaijan, Belarus, Bosnia, Bulgaria, Croatia, Czech Republic, Georgia, Hungary, Kazakhstan, Kosovo, Kyrgyzstan, Macedonia, Moldova, Montenegro, Poland, Romania, Russia, Serbia, Slovakia, Slovenia, Tajikistan, Turkmenistan, Ukraine and Uzbekistan. No archive.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Maximum use two minutes per match. Use within 24 hours.
DIGITAL: Standalone digital clips allowed. Maximum of two minutes per match and 3 minutes in total per day. Use within 24 hours. Territorial restrictions must be adhered to by use of geo-blocking technologies
SHOTLIST: Priestfield Stadium, Gillingham, England, UK. 5th January 2020.
++FULL STORYLINE TO FOLLOW++
Gillingham (blue) v West Ham United (white)
1. 00:00 Teams come out
2. 00:04 Crowd
First half:
3. 00:07 West Ham United manager David Moyes
4. 00:13 Lukasz Fabianski saves a shot from Brandon Hanlan in the 22nd minute
5. 00:29 Replay of the incident
Second half:
6. 00:34 Sebastien Haller hits the post in the 50th minute
7. 00:48 Replay of the incident
8. 00:54 West Ham appeal for a penalty after Declan Rice appears to be pulled back by Thomas O'Connor, but the referee dismisses their claims
9. 01:04 Replay of the incident
10. 01:11 GOAL - Substitute Pablo Zabaleta scores in the 74th minute (1-0 to West Ham)
12. 01:27 Replay of the goal
13. 01:33 GOAL - Pablo Fornals scores in the 94th minute (2-0 to West Ham)
14. 01:51 Replay of the goal
SOURCE: IMG Media
DURATION: 02:00
STORYLINE:
West Ham United booked their place in the fourth round of the FA Cup with a 2-0 win at League One (third tier) Gillingham on Sunday.
Pablo Zabaleta was West Ham's unlikely saviour.
The 34-year-old, only on the field as a substitute after an injury to Ryan Fredericks, scored his first goal in almost three years to break the deadlock midway through the second half.
Then, as Gillingham chased an equaliser, fellow sub Pablo Fornals finished them off with a breakaway goal in stoppage time.
Gillingham threatened an upset as West Ham failed to get to grips with the surface or their opponents during the first half, but they were a different side in the second to ensure they avoided a giant-killing after defeats to League One sides Wigan, AFC Wimbledon and Oxford in recent years.
Last Updated : Jan 6, 2020, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.