అమ్మ ఆశీర్వాదం కోసం తన కుమారుడి వివాహానికి ఆమె స్మారకాన్నే పెళ్లి వేదిక చేశారు శంకర్. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేశారు.
ఎంజీఆర్ ఫోరమ్ కార్యదర్శి, అన్నాడీఎంకే పార్టీ సభ్యులు గోకుల ఇంద్ర, మాజీ నగర కౌన్సిలర్ చిన్నయన్, ఇతర నాయకులు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. జయలలిత స్మారకం వద్ద ఇది తొలి వివాహం కావటం సంతోషంగా ఉందన్నారు గోకుల్ ఇంద్ర. వివాహానికి సహకరించిన తమిళనాడు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: కన్యాకుమారి టూ కశ్మీర్... 13 ఏళ్ల బాలుడి సైకిల్ యాత్ర