అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగొయి ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లు గువాహటి వైద్య కళాశాల ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కీలక పారామితులు నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే గొగొయి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉందని... మరో 48 గంటలు కీలకమని తెలిపారు. వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
కరోనా సోకిన తర్వాత చికిత్స నిమిత్తం ఈ నెల 2న గువాహటి వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరారు తరుణ్. అనంతరం కీలక పారామితులు క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేషన్ సాయంతోనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: 'ప్రతి ఇంటికి తాగు నీరు అందించడమే లక్ష్యం'