ఒడిశా మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. మాతిలి పోలీసు స్టేషన్ పరిధిలోని తేమూరుపాలి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని బాంబులు పెట్టి కూల్చేశారు.
దంతెవాడలో పోలీసు దమనఖాండకు నిరసనగా ఈ విధ్వంసానికి పాల్పడినట్లు చెబుతూ మావోయిస్టులు అక్కడ కరపత్రాలు విడిచివెళ్లారు.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో సుమారు 30 నుంచి 40 మంది మావోయిస్టులు పాల్గొని ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర