ETV Bharat / bharat

'చక్కా జామ్​' కోసం రైతులు, పోలీసుల ముమ్మర ఏర్పాట్లు - భారతీయ కిసాన్ యూనియన్

గణతంత్ర ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో... రైతు సంఘాలు శనివారం చేపట్టనున్న 'చక్కా జామ్'పై అందరి దృష్టి నెలకొంది. రహదారులు దిగ్బంధించే కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేస్తామని రైతు సంఘాలు చెబుతుండగా... భద్రతా దళాలు ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశాయి.

Many farmers coming Ghazipur to make chakka jaam a success
'ఫిబ్రవరి 6న చక్కా జామ్​ విజయవంతం చేస్తాం'
author img

By

Published : Feb 4, 2021, 1:46 PM IST

ఫిబ్రవరి 6న 'చక్కా జామ్​' పేరుతో నిర్వహించే రహదారుల దిగ్బంధం కార్యక్రమం కోసం రైతు సంఘాలు సిద్ధమవుతుండగా... పరిస్థితులు అదుపుతప్పకుండా చూసేందుకు భద్రతా దళాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.

రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ మీడియా ఇంఛార్జి ధర్మేంద్ర మాలిక్ చెప్పారు. దిల్లీ-ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దుల్లోని గాజీపూర్​ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రైతు శిబిరాలకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకుంటున్నారని తెలిపారు.

CRPF at boders
చక్కా జామ్​ను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో భారీగా సీఆర్​పీఎఫ్​ బలగాలు

యుద్ధప్రాతిపదికన చర్యలు....

చక్కా జామ్​ పిలుపు దృష్ట్యా భద్రతా దళాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. గాజీపుర్​ సరిహద్దుల్లో రైతు శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను మరింత పటిష్ఠపరిచేందుకు దిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కొన్ని మార్పులు చేయిస్తున్నారు.

జవాన్లపై ఎలాంటి దాడులు జరగకుండా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సీఆర్​పీఎఫ్​ అధినాయకత్వం సూచించింది. బలగాలు ప్రయాణించే బస్సులకు యుద్ధప్రాతిపదికన ముళ్ల కంచెలు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది.

ఇదీ చదవండి:అక్కడ పెళ్లి జరగాలంటే ఆధార్ ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.