మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలిపాయి దిల్లీ ఎయిమ్స్ వైద్య వర్గాలు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పాయి. కొవిడ్ పరీక్షల్లో మన్మోహన్‌కు నెగిటివ్ వచ్చినట్లు పేర్కొన్నాయి.
అస్వస్థతకు గురై ఆదివారం సాయత్రం ఎయిమ్స్‌లో చేేరారు మన్మోహన్. ఈరోజు ఆయనకు ఎలాంటి జ్వరం లేదని, కొన్ని పరీక్షల ఫలితాలు తెలియాల్సి ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఒక్క రోజులో ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయని చెప్పాయి.