ETV Bharat / bharat

మాంఝీ ఎంట్రీ.. ఎన్డీఏలో లుకలుకలు!

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో.. హిందుస్థానీ అవామ్​ మోర్చా(హామ్​) పార్టీ జతకట్టింది. ఈ మేరకు అధికారికంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి జీతన్​ రామ్​ మాంఝీ ప్రకటించారు. దీంతో ఎన్డీఏ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి.

Manjhi announces return to NDA ahead of Bihar polls
మాంఝీ ఎంట్రీ.. ఎన్డీయేలో లుకలుకలు!
author img

By

Published : Sep 2, 2020, 11:06 PM IST

Updated : Sep 3, 2020, 5:21 AM IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న మాజీ సీఎం జితన్‌రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) జేడీయూతో పొత్తు పెట్టుకోవడం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కి నచ్చడం లేదు. మొదటి నుంచీ జేడీయూతో అంటీముట్టనట్లు ఉండే ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులపై తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాలని యోచిస్తోంది.

జేడీయూ నుంచి వేరుపడి హెచ్‌ఏఎంను స్థాపించిన జితన్‌ రాం మాంఝీ మొన్నటి వరకు కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమిలో ఉన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ వైఖరి గిట్టక ఆ కూటమికి 'రాం రాం'చెప్పారు. దీంతో ఎన్డీఏ కూటమిలోకి చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. అనుకున్నట్లే జేడీయూతో పొత్తు పెట్టకున్నట్లు మాంఝీ బుధవారం ప్రకటించారు. సీట్ల ఒప్పందంపై ఇంకా చర్చ జరగలేదని చెప్పారు. అయితే, మగధ ప్రాంతంలో 15-20 నుంచి సీట్లు ఆ పార్టీ ఆశిస్తోంది. జేడీయూ మాత్రం 10-12 సీట్లు ఇవ్వాలని భావిస్తోంది.

విమర్శలు...

మాంఝీ ఎన్డీఏలో భాగస్వామి అవ్వడం పట్ల ఎల్‌జేపీ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఎల్‌జేపీ లక్ష్యంగా జితన్‌రాం మాంఝీ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఎల్‌జేపీకి మొదటి నుంచీ నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూతో ఉన్న సంబంధాలు అంతంత మాత్రమే. పలుమార్లు జేడీయూపై విమర్శలు చేసిన దాఖలాలూ ఉన్నాయి. పైగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన హెచ్‌ఏంఎకు వచ్చింది ఒక్కసీటే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్థానమూ రాలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీతో జట్టుకట్టి దళిత సామాజిక వర్గం ఓట్ల సంపాదించి తమ పార్టీని ఇరుకున పెట్టాలని నితీశ్‌ చూస్తున్నారని ఆ పార్టీ భావిస్తోంది.

దీంతో తమ పార్టీ అభ్యర్థులను జేడీయూ అభ్యర్థులకు పోటీగా బరిలోకి దించాలని ఎల్‌జేపీ భావిస్తోంది. వచ్చేవారం జరిగే పార్టీ రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ తెలిపారు. అయితే, కేంద్రమంత్రి, పార్టీ అగ్రనేత రామ్‌విలాస్‌ పాసవాన్‌ మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.

మరోవైపు బిహార్‌ ఎన్నికల విషయంలో భాజపా మాత్రం స్పష్టమైన వైఖరితో ఉంది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమారే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించింది. ఈ క్రమంలో కూటమిలోని రెండు పార్టీల మధ్య తలెత్తిన విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారనున్నాయి. పార్టీల మధ్య రేగిన చిచ్చును చల్లార్చి, ఎలాంటి విభేదాలు లేకుండా సీట్ల పంపకం చేపట్టడం ఆ పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యం. మొత్తం 243 సీట్లు ఉన్న బిహార్‌ అసెంబ్లీకి అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. కరోనా వేళ ఎన్నికలు నిర్వహించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసింది. నోటిఫికేషనే తరువాయి.

ఇదీ చూడండి: ఎన్డీఏ కూటమిలో చేరనున్న హిందుస్థానీ​ అవామ్ మోర్చా!

Last Updated : Sep 3, 2020, 5:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.