ETV Bharat / bharat

చెరువులో పడ్డ బంగారు గొలుసును వెతికిపెట్టిన రోబో! - robot

చాలాసార్లు విలువైన వస్తువులను చేజార్చుకుని బాధ పడుతుంటాం. ఎవరైనా కనిపెట్టి మనకు తిరిగిస్తే వారెంత మంచివారో అనుకుంటాం. కానీ, ఈ కథనం చూస్తే ఆ రోబో ఎంత మంచిదో అంటారు. అవును మరి... ఆ రోబో చెరువులో పడ్డ ఖరీదైన బంగారు గొలుసును వెతికి పెట్టింది.

చెరువులో పడ్డ బంగారు గొలుసును వెతికిపెట్టిన రోబో!
author img

By

Published : Sep 9, 2019, 6:49 PM IST

Updated : Sep 30, 2019, 12:45 AM IST

చెరువులో పడ్డ బంగారు గొలుసును వెతికిపెట్టిన రోబో!

కర్ణాటక మండ్యలోని కేఆర్​ పేట్​ తాలుకా కట్టరగట్ట గ్రామంలో ఓ రోబో అద్భుతం చేసింది. చెరువులో పడిపోయిన బంగారు గొలుసును చిటికెలో పట్టేసి శభాష్​ అనిపించుకుంది.

వినాయకుడి నిమ్మజ్జనం సమయంలో ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మెడలోంచి బంగారు గొలుసు పొరపాటుగా జారి చెరువులో పడిపోయింది. నీటి అడుగుకు చేరుకున్న గొలుసు మళ్లీ దొరకదనుకున్నారు. కానీ మంజునాథ్​ తన రోబోతో ఓసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు. నీటిలోకి రోబోను వదిలి గాలించారు. కొద్ది సమయంలోనే ఆ గొలుసును పట్టేసింది ఈ రోబో.

మంజునాథ్​ ఓ వ్యవసాయ శాస్త్రవేత్త. వ్యవసాయానికి ఉపయోగపడేలా ఈ రోబోను తయారుచేశాడు. ఏదో పనిముట్టును తయారు చేసుకున్నాడని గ్రామస్థులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు దొరకదనుకున్న బంగారు గొలుసును కనిపెట్టేసింది ఈ మరమనిషి. ఇంకేముంది ఈ అద్భుతాన్ని తయారు చేసినందుకు గ్రామస్థులంతా మంజునాథ్​ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

ఇదీ చూడండి: ఓనమ్​ వేడుకల్లో అలనాటి 'కుమ్మత్తికాళి' కళకళలు

Intro:Body:Conclusion:
Last Updated : Sep 30, 2019, 12:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.