కేరళలో ఓ ఫేస్బుక్ స్నేహితుణ్ని కలవడానికి వెళ్లిన వ్యక్తికి ఏకంగా రూ.కోటి లాటరీ తగిలింది. దీంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు కర్ణాటకలోని మండ్యకు చెందిన సోహన్ బలరామ్.
కేరళలోని తన ఫేస్బుక్ మిత్రుడిని కలవడానికి శనివారం కేరళ వెళ్లాడు సోహన్. తిరుగు పయనంలో అతడిని లాటరీ కొనుగోలు చేయాల్సిందిగా అతడి స్నేహితులు బలవంతం చేశారు. కాదనలేక రూ.100తో పుత్తనథని నగరంలోని ఓ షాప్‌లో భాగ్యధార లాటరీ కొనుగోలు చేసిన సోహన్నే.. అదృష్ట దేవత వరించింది.
ఇదీ చూడండి: 'ఫేస్బుక్ లైవ్‌తో అధికారుల దృష్టికి జలవిలయం!'