ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఝార్ఖండ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించారు. 'దక్షిణాదిన భాజపా ప్రభావం చాలా తక్కువని కొంతమంది అన్నారు. వారందరికీ కన్నడ ప్రజలు ఉప ఎన్నికల ఫలితాలతో గట్టి జవాబిచ్చారని' తెలిపారు. కర్ణాటకలో ప్రజా తీర్పుకు కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు తూట్లు పొడిచాయని ఆరోపించారు ప్రధాని. దొడ్డి దారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన హస్తం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు.
జమ్ముకశ్మీర్లో భారత రాజ్యాంగంలోని చట్టాలన్నీ అమలులోకి వచ్చాయని స్పష్టం చేశారు.