ETV Bharat / bharat

చలానా వేసినందుకు బైక్​నే తగలబెట్టేశాడు..! - అమలు

దిల్లీలో ఓ వ్యక్తి సొంత బైక్​నే తగలబెట్టుకున్నాడు. ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు భారీ జరిమానా వేయడమే ఇందుకు కారణం.

చలానా వేసినందుకు బైక్​నే తగలబెట్టేశాడు..!
author img

By

Published : Sep 6, 2019, 11:50 AM IST

Updated : Sep 29, 2019, 3:19 PM IST

చలానా వేసినందుకు బైక్​నే తగలబెట్టేశాడు..!

మోటారు వాహనాల చట్టం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక... ప్రతిచోట ట్రాఫిక్​ చలానాల గురించే చర్చ. నియమాలు ఉల్లంఘించినవారికి జరిమానాలు భారీగా ఉండడమే ఇందుకు కారణం. దిల్లీలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే... భారీ జరిమానాతో ఆగలేదు. ద్విచక్రవాహనం మొత్తం కాలి బూడిదైంది.
చిరాగ్​ దిల్లీ ప్రాంతానికి చెందిన రాకేశ్ గురువారం​ బైక్​పై వెళ్తుండగా పోలీసులు ఆపారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. కొత్త నిబంధనల ప్రకారం అతడికి రూ.10వేలు జరిమానా విధించారు.

అంతటి జరిమానా చూసి రాకేశ్​ కంగుతిన్నాడు. అసలే మద్యం మత్తులో ఉన్న అతడు... విచక్షణ కోల్పోయాడు. పోలీసులు బైక్​ను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో కోపోద్రిక్తుడయ్యాడు. పెట్రోల్​ ట్యాంకు తెరిచి, నిప్పంటించాడు. ఈ ఘటనతో పోలీసులు నివ్వెరపోయారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు ఆర్పారు.

రాకేశ్​ను పోలీసులు అరెస్టు చేశారు. వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇదీ చూడండి:'హెల్మెట్ లేని ప్రయాణం- రాహుల్​, గడ్కరీకి ఫైన్!​'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 29, 2019, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.