ఉత్తర్ ప్రదేశ్ బదాయూలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. భార్యను పిల్లలు కనే యంత్రంలా పరిగణించాడు ఓ దుర్మార్గపు భర్త. మగబిడ్డ కోసం ఆరాటపడి ఐదుగురు ఆడబిడ్డలకు తండ్రి అయ్యాడు పన్నాలాల్. ఆరోసారైనా మగబిడ్డ కావాలని భార్యకు ఆర్డర్ వేశాడు. అంతటితో ఆగకుండా ఆరోసారి గర్భం దాల్చిన భార్య గర్భాశయాన్ని చీల్చి పుట్టబోయేది మగ బిడ్డా కాదా అని చూసే ప్రయత్నం చేశాడు.
నెత్తుటి మడుగులో పడి ఉన్న గర్భిణిని ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.
పన్నాలాల్ను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. మగ బిడ్డ కోసం భార్యతో గతంలో అనేకసార్లు అతడు గొడవపడ్డట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: 6 అడుగుల పామును కోసి.. కూర వండి..