ETV Bharat / bharat

కర్కశం: భార్య, ముగ్గురు పిల్లల గొంతుకోసి హత్య - HUSBAND KILLS HIS WIFE AND 3 CHILDREN

దిల్లీలో దారుణం జరిగింది. తన భార్య ముగ్గురు పిల్లలను గొంతుకోసి హత్యచేశాడు ఓ కర్కశుడు​. మృతుల్లో రెండు నెలల పసికందు ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో ఈ దురాఘాతానికి పాల్పడ్డాడు నిందితుడు.

కర్కశం: భార్య, ముగ్గురు పిల్లల గొంతుకోసి హత్య
author img

By

Published : Jun 22, 2019, 1:12 PM IST

Updated : Jul 21, 2019, 5:08 PM IST

కర్కశం: భార్య, ముగ్గురు పిల్లల గొంతుకోసి హత్య

దేశ రాజధాని దిల్లీలోని మహరౌలీలో దారుణ ఘటన జరిగింది. ఒంటి నిండా కర్కశత్వంతో నిండిన ఓ వ్యక్తి... కట్టుకున్న భార్యను, రెండు నెలల చిన్నారి సహా ముగ్గురు కన్నపిల్లలను కడతేర్చాడు. కనికరం లేకుండా వారి గొంతు కోసి హత్య చేశాడు. శుక్రవారం అర్ధరాత్రి భార్య, పిల్లలు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రెండు నెలల పసికందు కూతురిని చూసైనా జాలి కలగలేదు ఆ కఠినాత్ముడికి.

ముగ్గురు పిల్లల్లో బాలుడికి ఐదేళ్లు కాగా, ఏడేళ్ల బాలికతో పాటు రెండు నెలల శిశువు ఉంది.

ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఉపేందర్ శుక్లా... ప్రైవేటు ట్యూటర్​గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులను శుక్లా ఎందుకు హత్యచేశాడో ఇంకా తెలియలేదని అధికారులు చెప్పారు. అతడు మానసిక ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఘటన జరిగిన సమయంలో ఇంట్లో శుక్లా అత్త కూడా ఉంది. శనివారం ఉదయం గది తలుపులు ఎంతకొట్టినా శుక్లా తెరవలేదు. పొరుగు వారి సాయంతో తలుపులు పగులకొట్టగా... ముగ్గురి శవాల పక్కన శుక్లా కూర్చొని ఉండటం చూసి స్థానికులు నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తానే హత్యకు పాల్పడినట్లు శుక్లా పేర్కొన్న లేఖను ఘటనా స్థలంలో గుర్తించారు అధికారులు. నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: టిక్​టాక్​ కోసం ప్రాణం తీసుకున్నాడు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Halle, Germany - 21st June 2019.
1. 00:00 SOUNDBITE (English): Roger Federer, beat Roberto Bautista Agut 6-3, 4-6, 6-4:
(about how difficult game was)
"Yeah, I mean it was very tough, especially in the middle. I got off (to) a flyer, you know played great in the first set, I broke him first game and then I broke him last game so in between it was tough. I think the result doesn't lie, we both had chances, especially in that third set too so, yeah, he had one bad game at the very end that cost him dearly, but from my side I'm very happy actually with my level. I thought it was another great match, I already played good against (Jo-Wilfried) Tsonga and it took Bautista Agut to play a really good game you know, and I thought he was rock solid for a very long time, and it was difficult today."
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 00:43
STORYLINE:
Roger Federer said he was "very happy" with his level after he beat Roberto Bautista Agut in three sets, 6-3, 4-6, 6-4, to reach the semi-finals of the Noventi Open in Halle, Germany, on Friday.
Last Updated : Jul 21, 2019, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.