ETV Bharat / bharat

అవసరం తీరింది.. చంపి గోడలో దాచేశాడు! - గోడలో మృతదేహం

ఆమెకు పెళ్లి అయ్యింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సుమారు 5ఏళ్ల వరకు అంతా సాఫీగా నడిచింది. ఈ వ్యవహారం అందరికీ తెలిసింది. ఒకానోక రోజు మహిళ ఇంటికి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ప్రియుడిని ప్రశ్నించారు. ఎంతకీ తెలియకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు అసలు విషయం బయటపడింది. ప్రేమించిన వాడే..ఆమెను హతమార్చాడు. చంపి మృతదేహాన్ని గోడలో దాచిపెట్టాడు.

Man kills girlfriend, hides her body in walls of flat; held
అవసరం తీరింది.. చంపి గోడలో దాచేశాడు!
author img

By

Published : Jan 16, 2021, 3:13 PM IST

Updated : Jan 16, 2021, 3:58 PM IST

మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తనతో కలిసి ఉంటున్న ప్రేయసిని హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోని గోడలో దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన పాల్‌గఢ్‌ జిల్లాలోని వనగామ్‌లో వెలుగులోకి వచ్చింది. నేరస్థుడిని అరెస్టు చేసి గోడలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

నిందితుడు గత ఐదేళ్లుగా 32 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే, గత కొన్ని నెలలుగా ఆమె కనిపించకుండా పోయింది. మహిళ కుటుంబసభ్యులు ఆమె గురించి నిందితుడిని ప్రశ్నించగా.. పని నిమిత్తం గుజరాత్‌లోని వాపికి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. కొంతకాలం ఎదురుచూసిన కుటుంబసభ్యులు ఆమె తిరిగి రాకపోవడంతో చివరికి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళతో సహజీవనం చేస్తున్న అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. వివాహం చేసుకోవాలని కోరుతుండటంతో నిందితుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని గోడలో దాచిపెట్టినట్లు నిందితుడు పేర్కొన్నట్లు తెలిపారు. వెలికితీసిన మృతదేహం దాదాపు అస్థిపంజరంగా మారింది. దీన్ని బట్టి గత అక్టోబర్‌ నెలలో ఆమెను హత్య చేసినట్లు భావిస్తున్నారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: బస్సులోనే యువతికి వేధింపులు.. ఇన్​స్టాలో ఆవేదన!

Last Updated : Jan 16, 2021, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.