ETV Bharat / bharat

రూ.200 అప్పు ఇవ్వలేదని మెకానిక్ హత్య

author img

By

Published : Nov 29, 2020, 4:59 PM IST

అతడో మెకానిక్​.. ముగ్గురు పిల్లలకు తండ్రి.. వాహనాల రిపేర్లు ​ చేస్తూ జీవిస్తుంటాడు. అలాంటి అతడి జీవితంలోకి శనివారం.. ఓ వ్యక్తి ప్రవేశించాడు. రూ.200 కోసం గొడవపడి, అతడి ప్రాణాల్ని బలిగొన్నాడు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

Man killed over Rs 200 in UP's Aligarh
రూ.200ల కోసం ఘోరం - ఓ వ్యక్తి బలి

ఉత్తర్​ప్రదేశ్ అలీగఢ్​​లో దారుణం జరిగింది. రూ.200 కోసం గొడవ పడి ఓ వ్యక్తి ప్రాణాలను బలితీశాడు ఓ క్రూరుడు.

ఏం జరిగిందంటే..?

అలీగఢ్​లోని సివిల్​ లైన్స్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో గల షంషాద్​ మార్కెట్​లో అన్సర్​ అహ్మద్(30)​ మెకానిక్​గా చేసేవాడు. ​ముగ్గురు చిన్నారులకు తండ్రి అతడు.

అసిఫ్​​ అనే ఓ వ్యక్తి శనివారం.. అహ్మద్​ షాపు వద్దకు వచ్చి, ఒక మోటార్​సైకిల్​ను కిరాయికి తీసుకున్నాడు. తర్వాత అదే రోజు మళ్లీ వచ్చి రూ.200 అప్పు ఇవ్వాలని అహ్మద్​ను ఒత్తిడి చేశాడు. ఆ డబ్బులిచ్చేందుకు అతడు నిరాకరించాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అసిఫ్​.. ఓ నాటు తుపాకీతో అహ్మద్​ తలకు గురిపెట్టి కాల్చాడు. స్థానికులు అందరూ చూస్తుండగానే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు మత్తుపదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి అని అలీగఢ్​ ఎస్పీ అభిషేక్​ కుమార్​ తెలిపారు. అహ్మద్​ను​ కాల్చిన అనంతరం.. మోటార్​సైకిల్​తో సహా అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు.

ఇదీ చూడండి:ఉత్తర్​ప్రదేశ్​లో తొలి 'లవ్​ జిహాద్' కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.