ETV Bharat / bharat

టికెట్​ రద్దు చేసిన రెండేళ్లకు రూ.33 రీఫండ్

తనకు రావాల్సిన రూ.35 రీఫండ్​ కోసం ఐఆర్​సీటీసీపై దాదాపు రెండేళ్లు పోరాడారు రాజస్థాన్​లోని కోటాకు చెందిన సుజీత్​ స్వామి అనే యువ ఇంజినీర్​. రెండేళ్ల తర్వాత రూ.33 పొందారు. 2017 ఏప్రిల్​లో టికెట్​ రద్దు చేస్తే... అప్పటికి జీఎస్టీ అమలులోకి రాకున్నా రూ.35 సేవా రుసుమును తీసేసి రీఫండ్​ చేసింది ఐఆర్​సీటీసీ. దీనిపైనే పోరాడారు సుజీత్​.

రెండేళ్ల తర్వాత రీఫండ్​
author img

By

Published : May 9, 2019, 6:10 AM IST

Updated : May 9, 2019, 7:47 AM IST

టికెట్​ రద్దు చేసుకున్నాక తనకు రీఫండ్​ రూ.35 తక్కువగా వచ్చిందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని రెండేళ్ల పాటు ఐఆర్​సీటీసీపై పోరాడారు రాజస్థాన్​లోని కోటాకు చెందిన ఓ యువ ఇంజినీర్​. మొత్తానికి రైల్వే నుంచి రెండేళ్ల తర్వాత రూ.33 రీఫండ్​ పొందారు.

2017 ఏప్రిల్​ టికెట్​ బుక్​..

సుజీత్​ స్వామి అనే ఇంజినీర్​ ఏప్రిల్​ 2017లో జీఎస్టీ అమలులోకి రాకముందు.. ఆ ఏడాది జులై 2న కోటా నుంచి దిల్లీ వెళ్లేందుకు ఐఆర్​సీటీసీ నుంచి రైలు టికెట్​ బుక్​ చేసుకున్నారు. ఆ తర్వాత టికెట్​ను రద్దు చేసుకున్నారు. టికెట్​ ధర రూ.765. టికెట్​ రద్దు చేసుకున్నాక ఆయన రూ.655ను రీఫండ్​గా పొందారు.

" వెయిటింగ్​ లిస్ట్​లో ఉన్న టికెట్​ క్యాన్సిల్​ చేసుకుంటే సాధారంగా రూ.65 మాత్రమే పోయి మిగతాది రీఫండ్​ రావాలి. కానీ రూ.100 కోత విధించారు. 2017 నుంచి ఈ విషయంపై పోరాడుతున్నా. ఐఆర్​సీటీసీ మాత్రం ఆ మొత్తం రీఫండ్​ అవుతుందని చెప్పింది" - సుజీత్​ స్వామి

రెండేళ్లుగా అలుపెరుగని పోరాటం

సుజీత్​ టికెట్​ బుక్​ చేసుకున్న సమయానికి జీఎస్టీ అమలులో లేకపోయినా రూ.35లను సేవా పన్ను కింద చార్జ్​ చేసింది రైల్వే.

దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఐఆర్​సీటీసీని ప్రశ్నించారు సుజీత్​ స్వామి. జీఎస్టీ అమలులోకి రాకముందు టికెట్​ బుక్​ చేసుకొని, ఆ తర్వాత రద్దు చేసుకుంటే సేవా రుసుము రీఫండ్​ కాదని చెప్పింది ఐఆర్​సీటీసీ. అయితే 2017 జులై 1 ముందు బుక్​ చేసుకొని రద్దు చేస్తే సేవా పన్ను కూడా రీఫండ్​ చేస్తామని చెప్పింది. తమ రూ.35ను రీఫండ్​ చేస్తామని 2017లోనే స్వామికి చెప్పింది ఐఆర్​సీటీసీ.

రెండేళ్ల తర్వాత రూ.33

అయితే దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మే 1న రూ.33లను బ్యాంకు ఖాతా ద్వారా అందుకున్నారు స్వామి.

"స.హ. దరఖాస్తుల ద్వారా ఈ విషయాన్ని ఆరా తీస్తున్నా. చాలా కాలం పోరాటం చేశా. గతేడాది డిసెంబర్​ నుంచి ఈ ఏడాది ఏప్రిల్​ చివరి వరకు నా దరఖాస్తులు 10సార్లు ఒక విభాగం నుంచి మరో విభాగానికి వెళ్లాయి. చివరికి రూ.33లు నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి" -- సుజీత్​ స్వామి

ఈ విషయమై ఏప్రిల్​ 2018లో లోక్​అదాలత్​కు వెళ్లానని చెప్పారు సుజీత్​ స్వామి. అయితే ఇది తమ పరిధిలోకి రాదని అదాలత్​ ఈ ఏడాది జనవరిలో తెలిపింది.

ఇన్నాళ్లు అనుభవించిన క్షోభకు రూ.2లు తగ్గించి ఇచ్చి ఐఆర్​సీటీసీ పరిహారం ఇచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు స్వామి.

2 రూపాయల కోసం పోరాడతా

ఈ విషయాన్ని తాను విడిచిపెట్టనని చెప్పారు స్వామి.

" నేను ఈ విషయాన్ని విడిచిపెట్టను. రూ.35 రీఫండ్​ చేస్తామని ఐఆర్​సీటీసీ చెప్పింది. రూ.33 జమ అయ్యాయి. ఆ రూ.2లు ఇవ్వాల్సిందే. -- సుజీత్​ స్వామి

9 లక్షల మందికి నష్టం

దాదాపు 9 లక్షల మంది జీఎస్టీ అమలులోకి రాకముందు టికెట్​ను రద్దు చేసుకొని సేవా రుసుమును కోల్పోయారని తెలిపారు సుజీత్​.

" జీఎస్టీ అమలులోకి రాకమునుపే 9 లక్షల ప్రయాణికుల నుంచి సేవా రుసుము కింద రూ.3.34 కోట్లు వసూలు చేశారు. వారిలో చాలా మందికి ఈ విషయం తెలియదు." -- సుజీత్​ స్వామి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
POOL - AP CLIENTS ONLY
Castle Rock - 8 May 2019
++AUDIO AS INCOMING++
++VIDEO AS INCOMING++
1. Various of court proceedings for Devon Erickson
STORYLINE:
The suspect in the Colorado school shooting, Devon Erickson, made his first court appearance on Wednesday, bowing his head during much of the proceedings.
The 18-year-old was shackled at the waist with his hands cuffed as he sat in a courtroom in Castle Rock, flanked by two defense lawyers.
Erickson nodded in answering the judge's questions, but at one point, the judge requested a verbal answer to whether he had any questions about the proceedings.
Erickson simply replied "No".
He is scheduled to return to court on Friday, when charges are expected to be filed.
Erickson is one of the two suspects accused of opening fire at the STEM School Highlands Ranch in the south Denver suburbs on Tuesday.
One student was killed and eight were injured. The other suspect is a juvenile.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 9, 2019, 7:47 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.