మహారాష్ట్ర ఠాణే జిల్లా దోనేవాడిలో దారుణం జరిగింది. ఒకే అపార్ట్మెంట్లో నివసిస్తోన్న ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి శరీరంపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నిఖిల్ గౌరవ్‌ను అరెస్టు చేశారు. మృతుడిని చంద్రకాంత్ పవార్‌గా గుర్తించారు.
ఏం జరిగింది..
చంద్రకాంత్ పవార్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి దోనేవాడిలోని విశ్వనాథ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. పది రోజుల క్రితం, విద్యుత్ బిల్లు వసూలు చేయటానికి గౌరవ్ ఇంటికి పవార్ కుమార్తె వెళ్లింది. ఈ విషయంలో ఆమెకు గౌరవ్ తల్లి మధ్య గొడవ జరిగింది. ఇరుగుపొరుగు నచ్చజెప్పటం వల్ల ఆ గొడవ సద్దుమణిగింది.
అయితే, సెప్టెంబర్ 10న నిఖిల్ గౌరవ్ మద్యం సేవించి పవార్ ఇంటికి వచ్చి మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పవార్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన పవార్.. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు వదిలాడు.
ఇదీ చూడండి: 'మహా'పై కొవిడ్ విధ్వంసం-కొత్తగా 24,619 కేసులు