ETV Bharat / bharat

ఆస్తి కాజేసేందుకు బంధువుకు కుటుంబ నియంత్రణ​..!

ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ కుటుంబాన్ని ఆస్తి వివాదం కుదిపేసింది. భూమి కోసం పక్కా ప్రణాళికతో తన బంధువుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆస్తి కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్​..!
author img

By

Published : Aug 29, 2019, 6:21 AM IST

Updated : Sep 28, 2019, 4:48 PM IST

ఆస్తి కాజేసేందుకు బంధువుకు కుటుంబ నియంత్రణ​..!

భూ వివాదాల వల్ల కుటుంబాల్లో తగాదాలు ఉండటం సాధారణంగా వింటూనే ఉంటాం. ఎలాగైనా ఆస్తి కాజేయడానికి బెదిరింపులు, హత్యల వరకూ దారి తీసిన వార్తలూ చూస్తూనే ఉంటాం. కానీ ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి... ఆస్తి కోసం తన బంధువుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించాడు. తన బంధువుకు పిల్లలు పుట్టకుండా చేసి ఆస్తిని సొంత చేసుకుందామని పథకం పన్నాడు.

ఇదీ జరిగింది...

మాధురి దేవీ ఉత్తర్​ప్రదేశ్​లోని రావత్​పుర్​ వాసి. ఆమెకు ఇద్దరు సంతానం. కూతురి వివాహం జరిగింది. ప్రస్తుతం తన 22 ఏళ్ల కొడుకు ఆనంద్​​తో జీవిస్తోంది.

10 ఏళ్ల క్రితం మాధురి భర్త మరణించాడు. మాధురికి నాలుగు బిఘాల వ్యవసాయ క్షేత్రం.. 83 గజాల భూమి ఉంది. తన కొడుకుతో ఆ 83 గజాల భూమిలో ఇల్లు కట్టుకుని నివసిస్తోంది మాధురి. ఆ భూమిపై ఆమె బంధువు శివనాథ్​ కన్నేశాడు. ఎలాగైనా ఆస్తిని దక్కించుకోవాలని పథకం పన్నాడు.

ఈ నెల 14న ఓ పనిపై డబల్​పులియాకు బయలుదేరాడు ఆనంద్​. ఆ దారిలో ఆనంద్​ను శివనాథ్​ అడ్డగించాడు. ముగ్గురు స్నేహితులతో ఆనంద్​ను బలవంతంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆనంద్​కు మత్తుమందు ఇచ్చి.. కొన్ని కాగితాలపై వేలిముద్రలను తీసుకున్నాడు. ఆ వెంటనే ఆనంద్​ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. అపస్మారక స్థితి నుంచి కోలుకున్న ఆనంద్​... ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లికి చెప్పుకుని బిక్కుబిక్కుమంటూ ఏడ్చాడు.

రెండు రోజుల తర్వాత కొడుకుతో ఆసుపత్రికి వెళ్లింది మాధురి. అప్పుడే ఒక నమ్మలేని నిజం ఆ తల్లికి తెలిసింది. ఆస్తి కోసం శివనాథ్​.. తన బిడ్డకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించాడని తెలుసుకున్న మాధురి కన్నీరు మున్నీరుగా విలపించింది.

కొడుకుకి సంతానం లేకపోతే తన ఆస్తి దక్కుతుందనే శివనాథ్​.. ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని మాధురి ఆరోపించింది.

శివనాథ్​ ఆసుపత్రిలో తనను భయపెట్టి ఓ కాగితంపై వేలి ముద్ర వేయించుకున్నాడని ఆరోపించాడు ఆనంద్​. ఈ పూర్తి వ్యవహారంపై కల్యాణ్​పుర్​ పోలీసులను సంప్రదించారు ఆ తల్లి-కొడుకు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి- ప్లాస్టిక్​ భూతం: ఆవు కడుపులో 45 కిలోల పాలిథీన్​

Intro:Body:Conclusion:
Last Updated : Sep 28, 2019, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.