ETV Bharat / bharat

విద్యుత్​ తీగలు తగిలి వ్యక్తి సజీవదహనం - రాయచూర్​ రైల్వేస్టేషన్

విద్యుత్​ తీగలు తగిలి ఓ వ్యక్తి సజీవ దహనమైన సంఘటన కర్ణాటక రాయ​చూర్​ రైల్వేస్టేషన్​లో జరిగింది. ఆ వ్యక్తి కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Man Died at Railway poll
విద్యుత్​ తీగలు తగిలి వ్యక్తి సజీవదహనం
author img

By

Published : Jun 2, 2020, 11:18 AM IST

రాయచూర్​ రైల్వేస్టేషన్​లో విద్యుత్​ తీగలు తగిలి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యడు. ఈ భయానక దృశ్యాలను స్టేషన్​లో ఉన్న ప్రయాణికులు చిత్రీకరించారు.

విద్యుత్​ తీగలు తగిలి వ్యక్తి సజీవదహనం

ఇదీ జరిగింది..

లాక్​డౌన్​ సడలింపుల్లో భాగంగా కేంద్రం రైళ్ల రాకపోకలను ప్రారంభించింది. ఈ క్రమంలో కర్ణాటకలోని రాయచూర్​ రైల్వే స్టేషన్​కు ముందుగా బుకింగ్​ చేసుకున్న ప్రయాణికులు చేరుకున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి రైల్వే విద్యుత్తు స్తంభాన్ని ఎక్కుతున్నట్లు గుర్తించిన ప్రయాణికులు అతడిని దిగమని కోరారు. అయితే అప్పటికే అతడికి కరెంటు తీగలు తాకటం వల్ల సజీవ దహనమయ్యాడు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి మృతదేహాన్ని కిందకు దించారు. అయితే ఆ వ్యక్తి కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:చైనాలో కరోనాతో డాక్టర్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.