ETV Bharat / bharat

పెళ్లి కోసం యూఏఈ నుంచి వచ్చి 'రైతు' నిరసనలో.. - రైతు నిరసనలు

వివాహం చేసుకోవాలని యూఏఈ నుంచి సెలవుపై ఇంటికి వచ్చిన ఓ యువకుడు.. తన నిర్ణయాన్ని మార్చుకుని రైతుల నిరసనల్లో పాల్గొన్నాడు. ఈ సంఘటన పంజాబ్​ జలంధర్​ జిల్లాలో జరిగింది. వివాహం, ఉద్యోగం కోసం వేచి ఉండొచ్చని, తన సాగు భూమిని రక్షించుకోవటమే ఇప్పుడు ముఖ్యమని చెబుతున్నాడు అతడు.

Farmers protest
రైతు నిరసనలు
author img

By

Published : Dec 23, 2020, 7:56 PM IST

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో దాదాపు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు రైతులు. వారికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లి కోసం యూఏఈ నుంచి ఇంటికి వచ్చిన ఓ యువకుడు.. తన వివాహ సన్నాహాలను వాయిదా వేసుకున్నాడు. నేరుగా దిల్లీ సరిహద్దులకు చేరుకొని ఆందోళనల్లో పాల్గొన్నాడు. పంజాబ్​కు చెందిన సత్నాం సింగ్​. ఈ ఉద్యమంలో గెలిచే వరకు వెనుదిరిగేది లేదని చెబుతున్నాడు.

ఇదీ జరిగింది..

పంజాబ్​ జలందర్​ జిల్లాకు చెందిన సత్నాం సింగ్​ (29).. ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం యూఏఈకి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చి వివాహం చేసుకోవాలని నిశ్చయింకున్నాడు. అందుకోసం రెండు నెలల సెలవుపై నవంబర్​ 29న స్వగ్రామం చేసుకున్నాడు.

అప్పటికే తన సోదరుడు, గ్రామంలోని రైతులు.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు సింగ్​. తన తల్లిదండ్రులతో రెండు రోజులు గడిపి.. స్నేహితుడితో కలిసి దిల్లీ-హరియాణా సరిహద్దుకు చేరుకున్నాడు.

దిల్లీ సరిహద్దుల్లో ఎన్ని రోజులు ఉంటారని ప్రశ్నించగా.. ఈ ఉద్యమంలో గెలిచే వరకు ఇక్కడే ఉంటామని సమాధానమిచ్చారు సింగ్​. అబుదాబీలో ఉద్యోగం రాకముందు తానూ రైతునేనని, తన పొలాలను రక్షించుకోవటమే ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'జనవరి 26న దిల్లీ వీధుల్లో రైతుల పరేడ్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.