
శారదా కుంభకోణంలోని అవినీతి అధికారులను కాపాడటం పైనే మమతా బెనర్జీ దృష్టిసారిస్తున్నారని.. రాష్ట్రంలోని పేద ప్రజలను దోచుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.
బంగాల్లో ఒక కవాతులో మాట్లాడిన ఆయన... కోల్కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ను కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు.
పోలీసు అధికారులను మమతా బెనర్జీ ఎందుకు కాపాడాలనుకుంటుందో తెలపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చోవటం రాజ్యాంగ వ్యతిరేకమని, అప్రజాస్వామికమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందకుండా చేస్తున్నారని యోగి విమర్శించారు.