సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికకు ఉపయోగించే కొలీజీయం విధానాన్ని ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకానికి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పద్ధతిలో ఎన్నికైన ముగ్గురు కమిషన్ సభ్యులు ఎన్నికలను నియంత్రించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈవీఎంలపై నిజనిర్ధరణ కమిటీ
సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజ నిర్ధరణ కమిటీ వేసి వాస్తవాలు బయటకు రాబట్టేందుకు డిమాండ్ చేయాలని విపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు దీదీ.
ఇదీ చూడండి: భానుడి భగభగలు- గణేశుడికీ చెమటలు!