ETV Bharat / bharat

రైతులతో మాట్లాడిన మమత- సరిహద్దుకు ఐదుగురు ఎంపీలు

author img

By

Published : Dec 23, 2020, 5:02 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం ఫోన్​లో మాట్లాడారు. ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

Mamata Banerjee speaks to farmers protesting at Singhu border, assures them of her support
రైతులతో ముచ్చటించిన మమతా బెనర్జీ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద దీక్షచేస్తున్న రైతులతో తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ అధినేత్రి మమతా బెనర్జీ ఫోన్​లో మాట్లాడారు. ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. దేశానికి అన్నం పెట్టే రైతులు.. ఆకలితో అలమటించడం దురదృష్టకరం అని మమత పేర్కొన్నారు. రైతులతో మమతా బెనర్జీ ఫోన్​లో మాట్లాడటం ఈ నెలలో ఇది రెండోసారి.

'రైతు దినోత్సవం'​ సందర్భంగా మమత సూచనల మేరకు.. టీఎంసీకి చెందిన ఐదుగురు ఎంపీలు.. సింఘు సరిహద్దుకు చేరుకుని తమ సంఘీభావం తెలిపారు. దేరెక్​ ఓబ్రెయిన్​, శతాబ్ది రాయ్​, ప్రసూన్​ బెనర్జీ, ప్రతిమా మండల్​, ఎండీ నదిముల్​ హాక్​లతో కూడిన​ ఎంపీల బృందం రైతుల నిరాహార దీక్షలో పాల్గొంది. కాగా.. మమతతో ఫోన్​లో మాట్లాడిన రైతు సంఘాల ప్రతినిధులు.. ఆమెను తమ ధర్నా ప్రదేశాన్ని సందర్శించాల్సిందిగా కోరారు.

నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా.. డిసెంబర్​ 23న పౌరులందరూ ఒక పూట భోజనం మానేయాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. డిసెంబర్​ 25 నుంచి 27 మధ్య టోల్​ రుసుం చెల్లించకూడదని నిర్ణయించారు.

ఇదీ చూడండి:'జనవరి 26న దిల్లీ వీధుల్లో రైతుల పరేడ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.