వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 2006లో ఇదే రోజున కోల్‌కతాలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. #standwithfarmers అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.
'వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించడానికి వ్యతిరేకంగా సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2006 డిసెంబర్ 4న కోల్‌కతాలో నేను 26 రోజుల నిరాహార దీక్ష ప్రారంభించా. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు నేను సంఘీభావం తెలుపుతున్నా.''
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
కేంద్రం.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించనున్నట్లు హెచ్చరించారు మమత.
దిల్లీ-హరియాణాలోని సింఘూ సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్న రైతుల వద్దకు తృణమూల్ కాంగ్రెస్ తరఫున పార్టీ సీనియర్ నేత డెరెక్ ఓబ్రియాన్ వెళ్లారు. ఆయన.. రైతు సంఘాల నేతలతో వేర్వేరుగా 4 గంటలకుపైగా మాట్లాడినట్లు సమాచారం. ఇదే సమయంలో.. పలువురు రైతులతో దీదీ ఫోన్లో సంభాషించారు. సమస్యలపై ఆరా తీసి రైతులకు భరోసా కల్పించారు.