ETV Bharat / bharat

'గడువు తీరిన ప్రధానితో వేదిక పంచుకోవాలా?' - ఫొని తుపాను

బంగాల్​లోని ఖరగ్​పూర్​లో ఫొని తుపాను ప్రభావాన్ని సమీక్షించడం వల్లే ప్రధాని మోదీ ఫోన్​ కాల్స్​కు స్పందించలేదని మమతా బెనర్జీ చెప్పారు. విపత్తుపై సమీక్ష కోసం కలైకుండకు రావాలని ప్రధాని అనడాన్ని మమత తప్పుబట్టారు. మోదీ పిలిచిన ప్రతి చోటకు వెళ్లడానికి నౌకర్లమా అని ప్రశ్నించారు.

'గడువు తీరిన ప్రధానితో వేదిక పంచుకోవాలా?'
author img

By

Published : May 6, 2019, 6:48 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఫొని తుపాను నేపథ్యంలో మోదీ ఫోన్​ కాల్స్​ వ్యవహారంపై ఎట్టకేలకు స్పందిస్తూ... ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు దీదీ. కోల్​కతాలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మోదీ సంప్రదించిన సమయంలో తాను ఖరగ్​పూర్​లో విపత్తు ప్రభావాన్ని సమీక్షిస్తున్నట్టు వివరించారు.

ఫొని తుపాను ప్రభావంపై చర్చించడానికి రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ మమత స్పందించలేదని ప్రధాని అన్నారు. చివరకు బంగాల్​ గవర్నర్​తో చర్చలు జరిపినట్టు తెలిపారు.

మమ్మల్ని పనివాళ్లు అనుకుంటున్నారా?

కలైకుండలో చర్చలు జరపడానికి ప్రధాని సంప్రదించినట్టు దీదీ తెలిపారు. ఆ సమయంలో తాను ఝార్​గ్రామ్​లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్టు వివరించారు.

" మోదీ పిలిచిన ప్రతి చోటకు వెళ్లడానికి మేము పనివాళ్లమా? నేను సహకరించలేదని, స్పందించలేదని నాపై ఆరోపణలు చేస్తారు. ఝార్​గ్రామ్​లో నా ఎన్నికల ప్రచారం ఎప్పుడో ఖరారైంది. ఒడిశాలో ఎన్నికలు ముగిసినా... బంగాల్​లో కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో గడువు తీరిన ప్రధానితో అసలు నేను ఎందుకు వేదిక పంచుకోవాలి?"
--- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి: భూలోకమా... పూలతో నిండిన స్వర్గమా..?

Udhampur (J-K), May 06 (ANI): Kashmiri Pandits cast their votes in Jammu and Kashmir's Udhampur for Anantnag parliamentary constituency today. A special polling station has been set up in Udhampur so that the migrants can cast their votes. The polling station has been set-up at old town hall building office. Speaking to ANI, one of the voters said, "We are migrants here. It's our duty to caste vote." Fifth phase of LS elections are underway for 51 parliamentary constituencies across 7 states in India today.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.