ETV Bharat / bharat

బండరాయిని ఢీ కొట్టిన బస్సు.. 9 మంది మృతి - udupi bus accident

కర్ణాటకలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీ కొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Major accident near Udupi: 9 people dead, 25 injured
అదుపుతప్పి బండరాయిని ఢీ కొట్టిన బస్సు.. 9మంది మృతి
author img

By

Published : Feb 16, 2020, 9:36 AM IST

Updated : Mar 1, 2020, 12:12 PM IST

బండరాయిని ఢీ కొట్టిన బస్సు.. 9 మంది మృతి

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్కాల తాలూకాలోని మల్​నుర్​ఘాట్​ వద్ద ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీ కొట్టగా.. 9 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా సమయంలో బస్సులో 35 మంది ప్రయాణిస్తున్నారు. మైసూరులోని ఓ ప్రైవేటు సంస్థకు చెందిన వీరంతా.. హోరనాడు నుంచి ఉడిపికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.

మలుపు వద్ద డ్రైవరు బస్సును అదుపు చేయలేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ప్లాస్టిక్​ బాటిళ్లతో సుందరమైన శ్వేత ఏనుగు!

Last Updated : Mar 1, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.