ETV Bharat / bharat

ప్లేగు వ్యాధి విజృంభణతో.. జాతిపితకూ క్వారంటైన్ - క్వారంటైన్​లో గాంధీ

జాతిపిత మహాత్మా గాంధీ కూడా ప్లేగు వ్యాధి విజృంభణ కారణంగా క్వారంటైన్​లో​ ఉండాల్సి వచ్చిందని మీకు తెలుసా? అవును 1896లో భారత్​ నుంచి దక్షిణాఫ్రికా చేరుకున్న గాంధీజీ 5 రోజులు క్వారంటైన్​లో ఉన్నారు. ప్లేగు వ్యాధి సోకిన భారతీయులకు స్వయంగా చేసిన సేవలు, ఆనాటి పరిస్థితుల గురించి తన ఆత్మకథ సత్యశోధనలో రాసుకొచ్చారు మహాత్ముడు. ఆ విశేషాలను తెలుసుకుందాం.

Mahatma Gandhi quarantine in South Africa
దక్షిణాఫ్రికాలో మహాత్ముడుకి క్వారంటైన్
author img

By

Published : May 10, 2020, 8:05 AM IST

1896 డిసెంబరు 18.. భారత్‌ నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికా చేరిన రెండు ఓడలు టోయిటోలో లంగరు వేశాయి. అప్పట్లో రేవులో లంగరు వేశాక.. ఓడ మీద పచ్చజెండా ఎగురవేస్తారు. డాక్టర్లు వచ్చి ప్రతి ప్రయాణికుణ్ని పరీక్షించే వరకూ ఆ జెండా ఎగురుతుంది. దారిలో ఎవరికైనా అంటురోగం పట్టుకుంటే వారిని ఓడలోనే 'క్వారంటైన్‌'లో ఉంచుతారు. 'మా కుటుంబం బొంబాయి నుంచి బయలుదేరినప్పుడు అక్కడ ప్లేగు వ్యాధి ఉంది. డాక్టరు వచ్చి 5రోజులు క్వారంటైన్‌ అని ఆదేశించారు. ప్లేగు క్రిములు 23 రోజులు జీవించి ఉంటాయని వారి ఉద్దేశం. మేం బొంబాయి నుంచి బయలుదేరి 18 రోజులైంది. ఇంకా 5రోజులు ఓడ మీదుంటే 23 రోజులు పూర్తవుతాయి. దీంతోపాటు డర్బన్‌లోని తెల్లవాళ్లు మమ్మల్ని.. తిరిగి ఇండియాకు పంపించేసేందుకు చేసిన కుట్ర కూడా మాకు క్వారంటైన్‌ విధించడానికి మరో కారణం' అని గాంధీజీ తన ఆత్మకథ సత్యశోధనలో వెల్లడించారు.

సేవ చేయడం బాధ్యత పెంచింది...

'నా లక్ష్యం ఆత్మదర్శనం. అందుకు ఎంచుకున్న మార్గం ప్రజాసేవ' అని సూటిగా ప్రకటించుకున్న గాంధీజీ... జొహెన్నెస్‌బర్గ్‌లో ప్లేగు సోకిన భారతీయులకు సేవలందించి పొంగిపోయారు. 'పేదవారైన భారతీయుల పట్ల నా పనిని, బాధ్యతను ఇది బాగా పెంచింది' అని సత్యశోధనలో రాసుకున్నారు. సేవ అంటే అప్పట్లో రోగుల మలమూత్రాలు ఎత్తివేయడం కూడా భాగంగా ఉండేది.

అది 1904వ సంవత్సరం..

గాంధీజీ దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం పోరాడుతూ, న్యాయవాదిగా పేదలకు సేవలందిస్తున్నారు. జొహెన్నెస్‌బర్గ్‌ బంగారు గనుల్లో ప్లేగు సోకింది. 23 మంది భారతీయులకు అంటుకుంది. స్థానిక 'ఇండియన్‌ ఒపీనియన్‌' వారపత్రిక నిర్వాహకులు మదన్‌జీత్‌... గాంధీకి కబురంపారు. వెంటనే అక్కడికి చేరుకున్న గాంధీ.. మదన్‌జీత్‌తో కలిసి ఖాళీగా ఉన్న ఇంట్లో బాధితులకు సపర్యలు ప్రారంభించారు.

తాత్కాలిక ఆసుపత్రి సిద్ధం

రెండోరోజు ఖాళీగా ఉన్న పెద్ద గోదాంను టౌన్‌క్లర్కు వీరికి అప్పగించారు. దాన్ని వారే శుభ్రం చేసుకుని, కొందరు భారతీయులిచ్చిన మంచాలతో తాత్కాలిక ఆసుపత్రిగా మార్చి రోగులను అందులోకి మార్చారు. అప్పట్లో ప్లేగు బాధితులకు బ్రాందీ పట్టేవారు. ఆ మేరకు మున్సిపాలిటీ వారు ఒక నర్సును, బ్రాందీ సీసాలు, మందులు పంపారు. నర్సు సూచించినా.. రోగులకు బ్రాందీ పట్టడానికి గాంధీ ఇష్టపడలేదు. ఆయన సూచనతో ముగ్గురు రోగులు బ్రాందీ తాగకుండా ఉండడానికి అంగీకరించారు. వైద్యుడి అనుమతితో వారికి నొప్పిగా ఉన్నచోట గాంధీ మట్టి పట్టీలు వేశారు. వారిలో ఇద్దరు బతికారు. మొత్తం 20 మంది రోగులు చనిపోయారు. మిగిలిన ముగ్గుర్ని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. 'నర్సు కూడా వ్యాధి సోకి చనిపోయిందని తర్వాత మాకు తెలిసింది. కొద్ది మంది రోగులు బతకడం, మేం ప్లేగు బారిన పడకుండా మిగలడం విచిత్రమే'నని గాంధీ రాసుకున్నారు.

బొంబాయిలో..

నాటి బొంబాయిలో ఒకసారి ప్లేగు ప్రబలింది. అప్పుడే దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన గాంధీ... ఇళ్లకు వెళ్లి తనిఖీ చేసేవారు. ఇప్పటిలా సెప్టిక్‌ ట్యాంకులు, ఇతర సదుపాయాలు ఉండేవి కావు. 'అంతా చీకటిమయం, దుర్గంధం. జీవితంలో ఇదే నరకం అనిపించింది. మలం నేల మీద పడకుండా బొక్కెనలు ఉంచమని చెప్పాం. దొడ్లలోకి గాలి వెలుతురు బాగా వచ్చేలా చేశాం. అయితే కొందరు ఈ మార్పులకు సిద్ధపడలేదు' అని నాటి స్థితిని సత్యశోధనలో వివరించారు మహాత్ముడు.

కుష్ఠురోగికి సేవలు

గాంధీ దక్షిణాఫ్రికాలో ఉండగా ఒకరోజు వారింటికి ఓ కుష్ఠురోగి వచ్చారు. 'అన్నం పెట్టి పంపి వేయడానికి మనసు అంగీకరించలేదు. ఒక గదిలో ఉంచి పుండ్లు కడిగి, కట్లు కట్టా. అలా ఎక్కువ రోజులు చేయలేకపోయా. ఆసుపత్రిలో చేర్పించా. ఎల్లప్పుడూ సేవ చేయగలిగితే బాగుండని అనుకున్నా. స్థానిక ఆసుపత్రిలో రోజు 2గంటలు సేవలందించేందుకు అనుమతి తీసుకున్నా. రోగుల బాధల్ని అడిగి తెలుసుకుని డాక్టరుకు చెప్పడం, డాక్టరు చెప్పిన మందు తయారుచేసి రోగులకు ఇవ్వడం నా పని. ఆ సమయంలో రోగపీడితులైన హిందూ దేశ వాసులతో పరిచయం ఏర్పడింది. వారిలో చాలామంది తమిళులు, తెలుగువారు, ఉత్తరాదివార'ని మహాత్ముడు ఆత్మకథలో రాశారు.

మేలుకొలుపు

సవాళ్లు ఎదురైనప్పుడే మనిషిలోని అసలు గుణాలు బయటపడతాయంటారు. ఈ కరోనా కష్టకాలమూ ప్రజల్ని పరీక్షిస్తోంది. వైద్యులు, నర్సులు ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తుండగా.. పలు అమానవీయ ఘటనలూ జరిగిపోతున్నాయి. ఈపరిస్థితుల్లో గాంధీజీ ఆచరణలో చూపిన సేవాధర్మం మనందరికీ మేలుకొలుపే.

ఇదీ చూడండి:స్వీయ నిర్బంధం.. అమ్మతో బలపడుతున్న బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.