అంతకంతకూ విస్తరిస్తోన్న కొవిడ్ మహమ్మారి ఎవ్వరినీ వదలట్లేదు. దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో మంత్రులు వరుసగా కరోనా బాధితులుగా మారుతున్నారు. రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి ధనంజయ్ ముండేకు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
ఇదివరకే మంత్రులు జితేంద్ర, అశోక్ చవాన్లకు కరోనా సోకింది. అయితే.. వీరిరువురూ కోలుకున్నారు. బాధిత మంత్రుల్లో ధనంజయ్ మూడో వ్యక్తి. ఆయన వ్యక్తిగత సహాయకుడు సహా ఇతర సిబ్బందికీ వైరస్ సోకినట్లు సమాచారం.
మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు ముండే. దీంతో అప్రమత్తమైన అధికారులు.. బాధితుల్ని గుర్తించే పనిలోపడ్డారు.
లక్షకు చేరువలో..
మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా ఉంది. కేసులు లక్షకు చేరువయ్యాయి. గడచిన 24 గంటల్లో 3607 మంది వైరస్ బారినపడ్డారు. మరో 152 మంది ప్రాణాలు కోల్పోయారు.