భారత్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో 24 గంటల్లోనే 7వేల 827మందికి వైరస్ సోకింది. మరో 173మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 54వేల 427కి చేరింది. మరణాల సంఖ్య 10వేల 289కి పెరిగింది. లక్షా 40వేల 325మంది కోలుకున్నారు.
తమిళనాడులో..
దక్షిణాదిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తమిళనాడులో కొత్తగా 4వేల 244మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 68మంది వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 38వేల 740కి చేరింది. ఇప్పటి వరకు 1,966 మంది ప్రాణాలు కోల్పోయారు. యూక్టివ్ కేసుల సంఖ్య 46వేల 969గా ఉంది.
దిల్లీలో 1573..
దేశ రాజధాని దిల్లీలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 1,573 మంది వైరస్ బారినపడ్డారు. మరో 37మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య లక్షా 12వేల 494కి చేరింది. ఇప్పటి వరకు 3 వేల371 మంది మరణించారు. రికార్డు స్థాయిలో 89వేల 968మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
కేరళలో 435
కేరళలో కొత్తగా 435 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7వేల 840కి చేరింది. 4 వేల 97మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.