ETV Bharat / bharat

మహారాష్ట్ర హోంమంత్రికి మరోమారు బెదిరింపు కాల్స్​ - Anil Deshmukh and Kangana Ranaut

కంగనా రనౌత్​ వివాదంలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​కు మరోమారు బెదిరింపు కాల్స్​ వచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. హిమాచల్​ప్రదేశ్​ నుంచి ఇద్దరు వ్యక్తులు ఫోన్​ చేసి బెదిరించారని.. ఈ అంశంలో దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు.

Maharashtra Home Minister Anil Deshmukh
మహారాష్ట్ర హోంమంత్రికి బెదిరింపు కాల్స్​
author img

By

Published : Sep 9, 2020, 10:59 AM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంలో మహారాష్ట్ర హోంమంత్రికి అనిల్​ దేశ్​ముఖ్​కు మరోమారు బెదిరింపు కాల్స్​ వచ్చాయి. రెండు సార్లు ఫోన్​ చేసి బెదిరింపునకు పాల్పడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

''హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన ఇద్దరు వేరు వేరు వ్యక్తుల నుంచి మంగళవారం, బుధవారం ఉదయం 6 గంటలకు ఫోన్​కాల్స్​ వచ్చాయి. ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.''

- దేశ్​ముఖ్​ సన్నిహిత వర్గాలు

ఆశ్చర్యకరం..

అంతకుముందు ఓ అజ్ఞాతవ్యక్తి నాగ్​పుర్​లోని తన కార్యాలయానికి ఫోన్​ చేసి తనతో పాటు ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​పై బెదిరింపులకు పాల్పడినట్లు సోమవారం వెల్లడించారు దేశ్​ముఖ్​. కంగనా రనౌత్​కు వై ప్లస్​ భద్రత కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'అది నిజమైతే ముంబయి వదిలి వెళ్లిపోతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.