శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు వారాల తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన హోంశాఖను శివసేన నేత ఏక్నాథ్ శిందేకు అప్పగించారు. ఆర్థిక శాఖను ఎన్సీపీ నేత జయంత్ పాటిల్‌కు, రెవెన్యూ శాఖను కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్‌కు కేటాయించారు.
శాఖల కేటాయింపు
శివసేన: హోం, పట్టణాభివృద్ధి, పర్యావరణ, పర్యటకం, పార్లమెంటరీ వ్యవహారాలు, సాంకేతిక ఉన్నత విద్య, క్రీడల శాఖలు.
ఎన్సీపీ: ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, జల వనరులు, గృహనిర్మాణం, ఆహార సరఫరా, కార్మిక శాఖలు.
కాంగ్రెస్: రెవెన్యూ, పాఠశాల విద్య, పశు సంవర్థక, మత్స్య శాఖలు
ఇదీ చూడండి: 'పౌర' ఆగ్రహం: ఈశాన్యంలో నిరసనలు హింసాత్మకం