దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నేటితో ముగియనున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ఆంక్షలను మే 31 వరకు పొడిగించింది ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ మెహతా. వివిధ ప్రాంతాల్లో దశల వారీగా ఆంక్షల సడలింపు లేదా ఎత్తివేతపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనే అత్యధిక కేసులు ఉన్నాయి. ఇటీవల నేరుగా మద్యం అమ్మకాలకు అనుమతించిన ప్రభుత్వం.. రెండు రోజుల్లోనే కేసులు గణనీయంగా పెరగటం వల్ల ఆన్లైన్లో టోకెన్లు జారీ చేస్తోంది.
మహారాష్ట్రలో కేసుల సంఖ్య 30వేలు దాటింది. 11 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
మరో రాష్ట్రం...
తమిళనాడు ఇదే బాటలో పయనించింది. లాక్డౌన్ను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వం గత రాత్రే ఇలాంటి ప్రకటన చేసింది.