మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ(భాజపా) సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖాడ్సే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాషాయం పార్టీని వీడినట్టు రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ తెలిపారు. ఏక్నాథ్.. ఈ శుక్రవారం(23వ తేదీ) మధ్యాహ్నం 2 గంటలకు లాంఛనప్రాయంగా ఎన్సీపీలో చేరనున్నారని చెప్పారు పాటిల్.
అవినీతి ఆరోపణల్లో భాగంగా.. 2016లో అప్పటి సీఎం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు ఏక్నాథ్. నాటి నుంచి ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఫడణవీస్, రౌత్ల రహస్య భేటీతో వేడెక్కిన 'మహా' రాజకీయం