ETV Bharat / bharat

భాజపా, శివసేన మోసం చేశాయని కోర్టుకెక్కిన ఓటరు

మహారాష్ట్రలో భాజపా, శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఓ ఓటరు కోర్టుకెక్కారు. ఎన్నికల ముందు పొత్తును గౌరవించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రజల తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ రెండు పార్టీలపై కేసు నమోదు చేయాలని కోరారు.

MH-HC-GOVT-LD PLEA
author img

By

Published : Nov 25, 2019, 3:18 PM IST

Updated : Nov 25, 2019, 5:22 PM IST

భాజపా, శివసేన మోసం చేశాయని కోర్టుకెక్కిన ఓటరు

మహారాష్ట్రలో ఎన్నికల ముందు ఏర్పడిన పొత్తును గౌరవిస్తూ భాజపా, శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఠాణే జిల్లాకు చెందిన ప్రియా చౌహాన్‌ అనే ఓటరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. భాజపా, శివసేనకు ప్రజలు పట్టం కట్టినా ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేసి, మోసం చేసినందుకు ఈ రెండు పార్టీలపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని కోరారు.

'ఎన్నికల ముందు పొత్తే ప్రామాణికం'

ఎన్నికల ముందు కూటమిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను ఈ రెండు పార్టీలు మోసం చేశాయని ఆమె ఆరోపించారు. ఎన్నికల ముందు నాటి కూటమి మేరకే ఇరు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు వారిని ఆదేశించాల్సిందిగా కోరారు.

ఫలితాల అనంతరం ఏర్పాటైన కూటములు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కేంద్ర , రాష్ట్ర యంత్రాంగాలను ఆదేశించాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలోనే హైకోర్టు విచారణ చేపట్టనుంది.

ఇదీ చూడండి: పార్టీ ఉపాధ్యక్షుడిపై దాడి- ఎగిరెళ్లి పొదల్లో పడ్డ నేత

Mumbai, Nov 25 (ANI): While speaking to ANI in an exclusive interview, Bollywood actress Taapsee Pannu spoke about her upcoming projects and fitness ideas. Taapsee said, "After 'Saand Ki Aankh', I am beginning to shoot for Filmmaker Anurag Kashyap's film in December." "After completing the shoot of his movie, my film 'Thappad' will be released and afterwards will start for 'Rashmi Rocket' movie," the actress added.
Last Updated : Nov 25, 2019, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.