మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. నార్కాసా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన పోలీసులు.. ఇద్దరిని ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలంలో మావోయిస్టులకు సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: మరో విక్రమ్‌ను రూపొందిస్తున్న ఇస్రో- కారణమిదే!