మహారాష్ట్రలోని నాసిక్‌లో ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు 'ఛత్రపతి సేన' ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నాసిక్‌లోని సీబీఎస్ ప్రాంతంలో మహారాజ్ శివాజీ విగ్రహం ఎదురుగా 13.5 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు ఉన్న ఛత్రపతి శివాజీ ఖడ్గాన్ని ప్రదర్శించారు. 123 కేజీల బరువున్న ఈ ఖడ్గం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రదర్శనలో భాగంగా శివాజీ కాలం నాటి పలు అస్త్రాల చిత్రాలను ప్రదర్శించారు. ఈ భారీ ఖడ్గం సిద్ధం చేసేందుకు సుమారు 2 నెలల సమయం పట్టింది. దీని తయారీకి ఉక్కు, ఇత్తడి, ఇనుము ఇతర లోహాలను ఉపయోగించారు. కత్తి అలంకరణకు ముత్యాలను వాడారు.
అవగాహన కల్పించేందుకు...
దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కత్తిని రూపొందించారు. మహిళలు మరింత ధైర్యంతో వారి హక్కుల సాధనకు పోరాడేలా ఇది ప్రేరేపిస్తోందని ఛత్రపతి సేన అభిప్రాయపడింది.