ETV Bharat / bharat

కాంగ్రెస్​కు స్పీకర్​.. ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రి - latest maharasthra chief minister

మహారాష్ట్ర కూటమి ప్రభుత్వం లెక్కలు తేలాయి. ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేను ఇప్పటికే ప్రకటించగా... ఇతర కీలక పదవులపైనా ఎన్సీపీ నేత ప్రఫుల్​ పటేల్ స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్​కు స్పీకర్​.. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయిస్తున్నట్లు తెలిపారు. డిసెంబరు 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు.

maha
కాంగ్రెస్​కు స్పీకర్​.. ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రి
author img

By

Published : Nov 28, 2019, 5:07 AM IST

ప్రభుత్వ ఏర్పాటు, విధివిధానాలపై మహా వికాస్ అఘాడీ నేతల​ కీలక భేటి ముగిసింది. కాంగ్రెస్​కు సభాపతి పదవి, ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రి, ఉపసభాపతి పదవులు కేటాయిస్తున్నట్లు ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్​ పటేల్​ స్పష్టం చేశారు. ముంబయిలోని వైభవం సెంటర్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రమాణస్వీకారం..

ఈ రోజు సాయంత్రం జరుగనున్న ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే మరో ఇద్దరు నేతలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు పటేల్. మంత్రి పదవులపై ఎలాంటి చర్చ జరగలేదన్న పటేల్​.. డిసెంబర్‌ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు.

పదవులపై స్పష్టత..!

3 పార్టీల మంత్రి పదవుల పంపకాలు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ముందస్తు ఒప్పందంలో భాగంగా శివసేన 15, ఎన్సీపీ 15, కాంగ్రెస్‌ 13 కేబినెట్‌ బెర్త్‌లను పంచుకున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి : 'శ్రీలంకకూ చైనా భయం- దిల్లీ వైఖరే కీలకం'

Viral Advisory
Wednesday 27th November 2019
SOCCER: Awkward! Enrique mistakenly says Moreno will stay on as fitness coach as major fall out in Spain team continues. Already moved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.