మహారాష్ట్ర శాసనసభ సమావేశాలకు రెండ్రోజుల ముందు స్పీకర్ నానాపటోలేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తన నియోజకవర్గంలో వరదల సహాయ కార్యక్రమాలకు పరిశీలించడానికి వెళ్లినప్పుడు వైరస్ బారిన పడినట్లు తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అయితే, నానా పటోలే గైర్హాజరు నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్, ఎన్సీపీ ఎమ్మెల్యే నరహరి గిర్వాల్.. సమావేశాలకు అధ్యక్షత వహించనున్నట్లు విధాన భవన్ అధికారి తెలిపారు.
అందరికీ పరీక్షలు..
ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన మహారాష్ట్ర శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎవరికీ ఇన్పెక్షన్ సోకకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యేలందరికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లు సరఫరా చేశారు.
ఇదీ చూడండి: రాజ్యసభ 'పెద్ద'లకు కరోనా భయం!