మహారాష్ట్రపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. శుక్రవారం 67 కొత్త కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 490కు చేరింది. తాజాగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మరణాలు 26కు చేరాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.
ముంబయి(43), మంబయి మెట్రోపాలిటన్(10), పుణె(9), అహ్మద్‌నగర్ జిల్లా(3), వాషిమ్(1), రత్నగిరి(1) ప్రాంతాల్లో ఈ తాజా కేసులు నమోదయ్యాయి. ముంబయి(2), వసాయి(1), విరార్(1), బద్లాపూర్(1), జాల్గావ్(1), పుణె(1)లో మరణాలు సంభవించాయి.
భద్రతా బలగాలకూ...
ముంబయిలోని 11 మంది కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల సిబ్బందికి కూడా కరోనా సోకింది. వీరంతా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తుండగా వైరస్ సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి : కరోనా పంజా: దేశంలో 24 గంటల్లోనే 478 కొత్త కేసులు