మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2014 ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణపత్రంలో తనపై పెండింగ్లో ఉన్న 2 క్రిమినల్ కేసులను వెల్లడించలేదని దాఖలైన పిటిషన్లపై విచారించింది సుప్రీం. ఈ అంశంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారన్న కేసు విచారణ కొనసాగించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్-125 కింద కేసు విచారణ కొనసాగించొచ్చని స్పష్టం చేసింది.
మహారాష్ట్ర ఎన్నికల నగారా మోగిన తరుణంలో సుప్రీం కోర్టు తీర్పు ఫడణవీస్‌కు కొంత ఇబ్బందికర అంశమే.
పిటిషన్ దాఖలు చేసిన సతీశ్ అనే న్యాయవాది...
2014 ఎన్నికల సమయంలో తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఫడణవీస్‌పై బాంబే హైకోర్టులో సతీశ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక చెల్లుబాటు కాదని ఆదేశాలు జారీ చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. అయితే హైకోర్టు సతీశ్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం వివరణ కోరుతూ గతంలో ఫడణవీస్‌కు నోటీసులు జారీ చేసింది.
సీఎం రాజీనామా చేయాలి: ఎన్సీపీ
ఫడణవీస్ అంశంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించింది ఎన్సీపీ. ముఖ్యమంత్రికి క్లీన్చిట్ ఇచ్చిన బాంబే హైకోర్టు తీర్పును ... అత్యున్నత న్యాయస్థానం పక్కనబెట్టిన నేపథ్యంలో ఫడణవీస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్. సీఎం రాజకీయాలను త్యజించాలని.. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కులేదని అన్నారు.
ఇదీ చూడండి: వాషింగ్టన్ వేదికగా అమెరికాకు జైశంకర్ కౌంటర్