'స్వాతంత్ర్యం కంటే ముందు పారిశుధ్యం ముఖ్యం' అని గాంధీ పలికిన మాటలను అక్షరాల ఆచరణలో పెట్టారు మధ్యప్రదేశ్‌కు చెందిన ఉదయ్ భాన్ సింగ్. అందుకే గాల్వియర్ జిల్లా రోడ్లపై గుట్కా మరకలు కనిపిస్తే చాలు ఏ పనిపై వెళుతున్నా.. వాహనాన్ని నిలిపి బ్రష్‌తో శుభ్రం చేసేస్తూ 'రోడ్డు క్లీనర్'గా గుర్తింపు పొందారు.
మోదీ ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ భారత్' బాటలో నడుస్తూ సమాజ శ్రేయస్సులో భాగమవుతున్నారు ఉదయ్.
'నేను జనవరి 12న స్వామి వివేకానంద జన్మదినాన ఓ కార్యక్రమానికి వెళ్లాను. అక్కడ కొంత మంది నిల్చున్నారు. వారు గుట్కా తిని మూడు నాలుగు చోట్ల ఉమ్మి వేశారు. అప్పుడు నాకు ఇది మంచి పద్ధతి కాదనిపించింది. అప్పటి నుంచి నేను బండి పక్కకు ఆపి శుభ్రం చేయడం ప్రారంభించాను.'
-ఉదయ్ భాన్ సింగ్
ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?
ఇంటి నుంచి బయల్దేరే ముందు.. ఒక నీళ్ల బాటిల్, ఒక బ్రష్ తనతో తీసుకెళ్లడం ఉదయ్‌కు నిత్యకృత్యంగా మారింది. ఆఫీసులో పని పూర్తయ్యాక రోజూ రెండు గంటలు ఇలా రోడ్లు శుభ్రం చేసే పని పెట్టుకున్నారు. విదేశీయులు తమ ప్రాంతాన్ని చూసి అసహ్యించుకోకూడదని కోరుకుంటున్నారు సింగ్.
'పురపాలక సంఘం చెత్త, మురికి కాలువలు వంటి పరిశుభ్రత కోసం పనిచేస్తుంది. కోట్లకు కోట్లు ఖర్చు కూడా చేస్తోంది. కానీ.. గ్వాలియర్‌కు వచ్చే విదేశీయులు రోడ్లపై ఈ గుట్కా మరకలు చూస్తే ఇక్కడి ప్రజలకు శుభ్రత తెలియదు అనుకుంటారు. మన అతిథులను ఉమ్ముతో స్వాగతిస్తామా? అందుకే నేను ఇలా చేస్తున్నా.'
-ఉదయ్ భాన్ సింగ్
ఇదీ చదవండి:అంబరాన్నంటిన 'బుఢీ దీపావళి' సంబరాలు