ETV Bharat / bharat

41 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన లాల్​జీ - lal ji tandon news

మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్​జీ టండన్​ తుదిశ్వాస విడిచారు. జూన్​ 11న స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నారు. 41 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు.

laljitandona
41 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన లాల్​జీ
author img

By

Published : Jul 21, 2020, 8:10 AM IST

Updated : Jul 21, 2020, 8:26 AM IST

మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్​జీ టండన్ (85) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అశుతోష్​ టండన్​వెల్లడించారు.

జూన్​ 11న ఆస్పత్రిలో చేరిక..

స్వల్ప అనారోగ్యంతో జూన్​ 11న ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని మేదాంత ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు టండన్​. సుమారు 41 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసి ఈ రోజు ప్రాణాలు విడిచారు. ​

ఐసీయూలోనే..

జ్వరం, మూత్రాశయ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు టండన్​. అప్పటినుంచి ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన ఐదు రోజుల తర్వాత ఆయన ఆరోగ్య మరింత క్షీణించిన కారణంగా వెంటిలేటర్​పై ఉంచారు వైద్యులు.

16న శస్త్రచికిత్స..

లాల్​జీ కడుపులో అంతర్గత రక్తస్రావం జరిగిందని.. ఇందు కోసం ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స చేసినట్లు జూన్​ 16న వెల్లడించారు వైద్యులు. సర్జరీ విజయవంతమైనట్లు తెలిపారు. ఆ తర్వాత ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయంలో సమస్యలు ఉత్పన్నమయిన కారణంగా ఆయనను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించారు.

Last Updated : Jul 21, 2020, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.