ETV Bharat / bharat

అదిరే 'సింగం' స్టంట్​కు- రూ.5 వేల జరిమానా! - police doing like singham

బాలీవుడ్​ 'సింగం' సినిమాలో హీరో చేసిన స్టంట్లకి థియేటర్లలో చప్పట్లు, ఈలలు మారుమోగిపోయాయి. మరి, అలాంటి సాహసం చేసే అసలైన సింగం కనిపిస్తే.. లైకులపైలైకులు కురువకుండా ఉంటాయా? మధ్యప్రదేశ్​కు చెందిన ఓ పోలీసు.. కదులుతున్న రెండు కార్లపై నిలబడి స్టైల్​గా దూసుకొచ్చిన వీడియో తెగ వైరల్​​ అయ్యింది. కానీ, ఆ స్టంట్​ చూసిన ఉన్నతాధికారులు మాత్రం పోలీసుకు రూ. 5 వేల జరిమానా విధించారు!

Madhya Pradesh cop fined Rs 5,000 for performing 'Singham' stunt at work
సింగం సాహసాన్ని గుర్తించి.. రూ.5 వేల జరిమానా విధించారు!
author img

By

Published : May 12, 2020, 12:21 PM IST

మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్‌ అధికారి చేసిన సినిమా స్టంట్‌కు ఉన్నతాధికారులు జరిమానా విధించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవడం వల్ల సంబంధిత అధికారిని హెచ్చరించి వదిలేశారు. మరోసారి ఇలా చేయొద్దని తీవ్రంగా మందలించారు.

సింగం సాహసాన్ని గుర్తించి.. రూ.5 వేల జరిమానా విధించారు!

అసలేం జరిగిందంటే..

దామోహ్‌ జిల్లాలోని నార్సింగ్‌గర్హ్‌ ఎస్సై మనోజ్‌ యాదవ్‌ ఇటీవల బాలీవుడ్‌ సినిమా 'సింగం'లోని ఓ స్టంట్‌ను అనుకరించారు. హీరో అజయ్‌దేవ్‌గణ్‌ రెండు కార్లపై నిల్చొని ప్రయాణిస్తోన్న విధంగా ఆ ఎస్సై కూడా పోలీసు దుస్తులు ధరించి రెండు కార్లపై నిల్చొనే స్టంట్‌ చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం వల్ల అధికారులు విచారణ జరిపారు.

జిల్లా ఎస్పీ హేమంత్‌ చౌహన్‌.. సంబంధిత ఎస్సైకి రూ.5 వేల జరిమానా విధించి, ఇలాంటి వీడియోలు మరోసారి చేయొద్దని హెచ్చరించారు. అలాంటివి ప్రమాదకరమని, యువతపై ప్రభావం చూపుతాయని మందలించారు.

ఇదీ చదవండి:ముందు చూస్తే కరోనా.. వెనుక చూస్తే క్యాన్సర్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.