ETV Bharat / bharat

చైనా బొమ్మలు, కాస్మొటిక్స్​తో ఇంత ప్రమాదమా? - బాయ్​కాట్​ చైనా

'మేడిన్​ చైనా' అంటే చీప్​ ఉత్పత్తులకు పెట్టింది పేరు. చూడటానికి ఆకర్షణీయంగా, నాణ్యతలో కనీస ప్రమాణాలు లేకుండా ఉంటాయి చాలా వస్తువులు. ఇప్పటికే చైనా యాప్​లు, సాంకేతికతతో దేశ భద్రతకే ముప్పుందని భారత ప్రభుత్వం హెచ్చరించగా.. తక్కువ రేట్లకు మార్కెట్లలో దొరికే ఆ దేశ ఉత్పత్తులు తెలియకుండానే మనిషి శరీరాన్ని నాశనం చేస్తున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

china products with health problems
చైనా​ ఉత్పత్తులను కొనడం ఎంత మాల్యానికి..?
author img

By

Published : Jul 4, 2020, 9:59 AM IST

మార్కెట్లలో తక్కువ ధరకు దొరికే వస్తువులు ఏవి? అంటే చైనా ఉత్పత్తులని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. అందుకే చైనా బజారుల్లో రూపాయి నుంచే వస్తువులు దొరుకుతాయి. మరీ చీప్ ధరలకే లభించే మన్నిక లేని ఉత్పత్తులతో మనకు ఏ మేర నష్టం జరుగుతుందో తెలుసా? వాళ్లు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో హానికర రసాయనాలతో తయారు చేసిన వస్తువులను మన మార్కెట్లలోకి వదులుతున్నారని తెలుసుకున్నారా?

china products with health problems
మేడిన్​ చైనా

బొమ్మల్లో కాడ్మియం..

చైనా బొమ్మలు చూడటానికి రంగురంగుల్లో ఉండి పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి. తక్కువ ధరే కావడం వల్ల మనం కొనేసి వారి చేతుల్లో పెట్టేస్తుంటాం. అయితే దానితో ఎంత చేటు జరుగుతుందని అనుకుంటున్నారు. ఆ బొమ్మల్లో శరీరానికి హాని కలిగించే కాడ్మియం ఉంటుంది. ఈ రసాయనం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్వాసకోస సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ ఉత్పత్తుల్లో వాడే హానికారక రసాయనాల వల్ల క్యాన్సర్ ముప్పు తప్పదు. క్వాలిటీ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా తయారు చేసిన ఓ సర్వే ప్రకారం.. దిల్లీ మార్కెట్లలో దొరికే చైనా వస్తువుల్లో దాదాపు 67 శాతం కనీస నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయాయి.

china products with health problems
ప్లాస్టిక్​ బొమ్మలు

బ్యూటీ కోసం చూసుకుంటే...

యువతీ యువకులు వాడే సౌందర్య ఉత్పత్తులనూ చాలా చీప్​గా, తక్కువ ధరలకే తయారు చేస్తాయి చైనా సంస్థలు. ఆ ఉత్పత్తుల కాల పరిమితి 6 నెలల నుంచి 12 నెలలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కార్సినోజెనిక్​ జిగురు, పీవీసీ, ఫార్మల్​డీహైడ్​తో వాటిని ప్యాక్​ చేయడమే కారణం. ఇలాంటి నాసిరకం బ్యూటీ ఉత్పత్తులే రోజూ విపరీతంగా అమ్ముడవుతున్నాయి. భవిష్యత్తులో వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

china products with health problems
సౌందర్య ఉత్పత్తులు

నకిలీ మందులు..

వైద్య రంగంలోనూ చైనా ఉత్పత్తుల హవా నడుస్తోంది. ట్రెడిషనల్​ చైనీస్​ మెడిసిన్​(టీసీఎం) ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. ప్రజలు సైడ్​ ఎఫెక్ట్​లను కూడా పట్టించుకోకుండా వాడేస్తున్నారు. కానీ... క్యాన్సర్​ సహా కొన్ని దీర్ఘకాల వ్యాధులకు ఇవి కారణం అవుతున్నాయని వేర్వేరు అధ్యయనాల్లో తేలింది.

china products with health problems
చైనా మందుల ముడిసరుకు

ఫాస్ట్​ఫుడ్​లో రసాయనాలు..

చైనీస్​ ఫాస్ట్​ఫుడ్​ అంటే యువత నోరూరిపోతుంది. అందులో వేసే మసాలాలు, స్పైసీ వస్తువులే ఇందుకు కారణం. అయితే ఇందులో ఉపయోగించే అజినోమోటో(చైనీస్​ సాల్ట్)​, సోయా సాస్​ వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది. మెదడు​ సహా నరాల వ్యాధులకు ఇవి కారణమవుతాయి. హైపర్​ టెన్షన్​, తలనొప్పి, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, కడుపునొప్పి, అధిక రక్తపోటు వంటి సమస్యలను మనకు తెచ్చిపెడుతున్నాయి.

china products with health problems
చైనీస్ పాస్ట్​ఫుడ్​

మన సంస్థలు కుదేలు..

చైనా ఉత్పత్తులతో మన ఆరోగ్యంపైనే కాకుండా మన సంస్కృతి, జీవనశైలిపైనా ప్రభావం పడుతుంది. కాస్త ఎక్కువ ధర అయినా నాణ్యతను నమ్ముకున్న భారతీయ సంస్థలు ఇప్పటికే చైనా సంస్థల దెబ్బకు దుకాణం సర్దేసుకున్నాయి. మరికొన్ని తయారీ సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి. అందుకే చీప్​గా దొరుకుతున్నాయని చైనా ఉత్పత్తులను కొనడం ఎంత మూల్యానికి? పాడాల్సిందే చరమగీతం అంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా 'బాయ్​కాట్​ చైనా' నినాదం జోరందుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.